ముఖ్యంగా టాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ హీరోలు, తమ కొడుకులతో కలిసి నటించిన సినిమాలు చాలానే ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన తండ్రికొడుకుల జోడి అక్కినేని నాగేశ్వరరావు అలాగే నాగార్జున. వీరిద్దరి కాంబినేషన్లో చాలా సినిమాలే వచ్చాయి అని చెప్పవచ్చు. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో ఏ ఏ సినిమాలు వచ్చాయో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం..
1. కలెక్టర్ గారి అబ్బాయి:
అక్కినేని నాగేశ్వరరావు, నవ మన్మధుడు నాగార్జున ఇద్దరు కలిసి నటించిన చిత్రం కలెక్టర్ గారి అబ్బాయి. ఈ చిత్రాన్ని బి.గోపాల్ డైరెక్ట్ చేయగా , అన్నపూర్ణ స్టూడియోస్ తో పాటు ఎస్ ఎస్ క్రియేషన్స్ వారు సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కించడం జరిగింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.
2. అగ్నిపుత్రుడు:
మరో సారి వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా అగ్నిపుత్రుడు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించారు.అయితే ఈ సినిమా మాత్రం ఊహించిన స్థాయిని అందుకోలేక డిజాస్టర్ గా మిగిలింది.
3. రావుగారిల్లు:
తండ్రి కొడుకు ల కాంబినేషన్ లో వచ్చిన మరో సినిమా రావు గారి ఇల్లు. ఇక ఈ చిత్రం మాత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని అందుకుంది.
4. ఇద్దరూ ఇద్దరే:
ఇక నాలుగో సారి వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఇది. ప్రముఖ దర్శకుడు ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను , తమ సొంత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై తెరకెక్కించారు. ఇక ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ ను చవిచూసింది.
5. శ్రీరామదాసు:
ఇక వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఐదవ సినిమా శ్రీరామదాసు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.
6. మనం:
అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మనం. ఈ సినిమాను నాగార్జున డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో వీరిద్దరితో పాటు నాగార్జున తనయులు ఇద్దరు కూడా నటించి మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా తర్వాత నాగేశ్వరరావు మరణించిన విషయం తెలిసిందే.