డేటింగ్.. ఈ పదం చాలా కామన్ అయిపోయింది. మొదట్లో బాలీవుడ్లో మాత్రమే డేటింగ్ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు వినిపించేవి.మెల్లమెల్లగా అది కోలీవుడ్, టాలీవుడ్లో కూడా ఫేమస్ అయిపోయింది. అయితే డేటింగ్ లో ఉన్న జంటలు.. కొన్నాళ్ల తర్వాత పెళ్లి చేసుకోవడం అనేది ఆనవాయితీగా ఉండేది.
మరికొన్ని జంటలు బ్రేకప్ అయిపోయేవి. కానీ కొన్ని జంటలు మాత్రం ఏళ్ళకు ఏళ్ళు డేటింగ్ చేస్తూనే ఉన్నాయి. అయితే ఇలా డేటింగ్ లో ఉంటున్న వారిని పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారు అని అడిగితే మాత్రం వారి నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. అలా మన సినీ ఇండస్ట్రీలో ఎవరెవరు ఉన్నారో ..?మోస్ట్ ఎలిజిబుల్ డేటింగ్ కపుల్స్ ఏంటో ఓ లుక్కేద్దాం రండి..
నయనతార-విగ్నేష్:
నయనతార ప్రభుదేవాతో ప్రేమాయణం నడిపింది. కానీ అతనితో విభేదాలు రావడంతో గత కొంత కాలంగా దూరంగా ఉంటోంది.కానీ ఇప్పుడు ప్రముఖ దర్శకుడు విగ్నేష్ శివన్ తో చాలా కాలం నుండి డేటింగ్ లో ఉంది. వీళ్ళ పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న అందరిలోనూ ఉంది. కానీ ఆ విషయం పై వీళ్ళు నోరు మెదపడం లేదు. ఓ పక్క సినిమాలు చేసుకుంటూ మరోపక్క డేటింగ్ చేసుకుంటూ హ్యాపీగా గడిపేస్తున్నారు.
దిషా పాటనీ-టైగర్ ష్రాఫ్:
భాఘీ2 సినిమాలో టైగర్ ష్రాఫ్ తో జోడిగా నటించి మంచి మార్కులే కొట్టేసింది దిషా పాటనీ. ఈ సినిమాకి ముందే వీరిద్దరూ డేటింగ్ చేస్తూ ఆ యవ్వారం మెల్లగా రిలేషన్ షిప్ వరకు వెళ్లిందని వచ్చిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కియారా అద్వానీ-సిద్దార్థ్ మల్హోత్రా:
ధోని సినిమా ద్వారా మంచి గుర్తింపు పొందిన కియారా అద్వానీ ,ఆ తర్వాత రామ్ చరణ్ సరసన వినయ విధేయ రామ సినిమాలో నటించి మంచి గుర్తింపు పొందింది. కియారా అద్వానీ చాలా కాలం నుండీ సిద్దార్థ్ మల్హోత్రాతో డేటింగ్ లో ఉంది. చాలా సార్లు వీళ్ళు మీడియా కంట్లో పడ్డారు. పెళ్లి గురించి అయితే ఇప్పట్లో వీళ్ళు ఆలోచించే అవకాశం లేదు.
ఐరా ఖాన్- నుపూర్ షిఖరే:
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ డాటర్ ఐరా ఖాన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకపోయినా స్టార్ కిడ్‌గా, తన పర్సనల్ విషయాలతో సోషల్ మీడియాలో ఎప్పుడూ సందడి చేస్తుంటుంది.. గతకొంత కాలంగా తండ్రి ఆమిర్ ఖాన్ పర్సనల్ ఫిట్‌నెస్ ట్రైనర్ నుపూర్ షిఖరేతో పాప పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతుంది.. నపూర్ వ్యక్తిత్వం బాగా నచ్చడంతో అతడితో ప్రేమాయణం స్టార్ట్ చేసింది ఐరా ఖాన్. ఆ తర్వాత కొద్ది రోజులకే తనతో రిలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. ఇక అప్పటినుండి ఇన్‌స్టాగ్రామ్‌లో వీరిద్దరు కలిసున్న పిక్స్ షేర్ చేస్తూ రచ్చ లేపుతోంది.
అవికా గోర్-మిలింద్:
చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ద్వారా బాగా పాపులారిటీ అందుకున్న అవికా గోర్ గత కొద్ది కాలం నుండి మిలింద్ అద్వానీతో ప్రేమ లో ఉంది. అతను ఓకే అంటే పెళ్లి చేసుకోవడానికి రెడీ అంటుంది. కానీ మిలింద్ ఎప్పుడు ఓకే చెబుతాడో..!
కత్రినా కైఫ్-విక్కీ కౌశల్:
ఈమె చాలా కాలంగా స్టార్ హీరో విక్కీ కౌశల్ తో ప్రేమలో ఉంది. వీళ్ళు చాలా సార్లు మీడియా కంట పడ్డారు. వీరు కూడా ఇప్పట్లో పెళ్లి చేసుకునేలా కనబడడం లేదు.
శృతిహాసన్-సంతాను హజారికా:
కమల్ హాసన్ గారాల పట్టి శృతి హాసన్ ప్రస్తుతం సంతాను హజారికా అనే వ్యక్తితో డేటింగ్ లో ఉంది. ఈ విషయాన్ని వీళ్ళు భహిరంగంగానే తెలియజేసారు.