శాండల్ వుడ్ మెగాస్టార్ ఉపేంద్ర.. ఈయన గురించి మన తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఏందుకంటే.. ఈయన మనకు బాగా సుపరిచితమే. తెలుగులో ఎన్నో సినిమాలు చేసారు. ‘కన్యాదానం’ ‘ఏ’ ‘ఉపేంద్ర’ ‘రా’ ‘రక్త కన్నీరు’ ‘ఒకేమాట’ ‘స్టుపిడ్’ చిత్రాలతో మన తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు ఉపేంద్ర. ఈ శాండల్ వుడ్ హీరో కన్నడ సీమలో హీరోగా.. బిజీగా ఉంటూనే సినిమాలకు దర్శకత్వం కూడా వహిస్తూన్నారు. ఆయన నటిస్తున్న ప్రతీ సినిమాను తెలుగులో డబ్ చేసి విడుదల చేస్తూ ఇక్కడ కూడా ఆయన మంచి మార్కెట్ ఏర్పరచుకున్నాడు.. అంతేకాదండోయ్ నటనా దర్శకత్వం.. ఏది చేసినా అందులో ఏదో ఒక్క స్పెషాలిటి చూపించేందుకు తపిస్తుంటారు ఈ హీరో.
అయితే ఆయన బ్యాడ్ లక్..ఆయన చేసిన ప్రయోగాలు కొన్ని బాక్సాఫీస్ వద్ద బోల్త కొట్టాయి. కాగా ఉపేంద్ర తెలుగు సినిమాల్లో నటించి చాలా కాలమవుతోంది. చివరగా 2015లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలో స్పెషల్ పాత్రలో నటించాడు. ఈ సినిమా విజయం సాధించడమే కాకుండా ఉపేంద్రకి మంచి పేరుని కూడా తెచ్చిపెట్టించి. అయితే ఈ సినిమా తర్వాత వరుసగా ఆఫర్స్ వచ్చినప్పటికీ ఆయన ఒక్క సినిమా కూడా అంగీకరించలేదు. ప్రస్తుతం రాజకీయాలో బిజీగా ఉన్నాడు ఈ హీరో.
అయితే ఉపేంద్ర కెరీర్ ప్రారంభంలో కన్నడం లో స్టార్ హీరోయిన్ గా ఉన్న ప్రేమ తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడంటూ వార్తలు హల్ చల్ చేసాయి. అంతేకాదు..వారిద్దరు కలిసి ఎన్నో హిట్ సినిమాల్లో కూడా నటించారు. ఆన్ స్క్రీన వాళ్ల జంట అంటే అదో స్పెషల్ ఎట్రాక్షన్. దీంతో ఉపేంద్ర-ప్రేమ ల మధ్య లవ్ ట్రాక్ నడిచిందంటూ వార్తలు గుప్పుమన్నాయి.
అయితే ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ ఉపేంద్ర ప్రేమకు దూరమయ్యారని అంటారు కొందరు సిని ప్రముఖులు. ఇక అప్పుడే ఉపేంద్ర తనతో పాటు కొన్ని సినిమాల్లో నటించిన ప్రియాంక ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.ఏదేమైనా ఇన్ని సంవత్సరాలు గడుస్తున్న ఇప్పతికి ఉపేంద్ర – ప్రేమ ప్రేమాయణం ఒక సంచలనంగానే ఉండిపోయింది.