తెలుగు సినీ పరిశ్రమలో కామెడీ సినిమాలకు పెట్టింది పేరు నరేష్. నరేష్ నటి విజయ నిర్మల, ఆమె మొదటి భర్త కృష్ణ మూర్తికి జన్మించాడు. ఒకప్పుడు రాజేంద్రప్రసాద్ తో పోటీ పడి మరీ హాస్య సినిమాల్లో నటించేవాడు నరేష్. బాలనటుడిగా సినీ పరిశ్రమకు వచ్చిన నరేష్ ఆ తర్వాతి కాలంలో కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయాడు. జంధ్యాల, రేలంగి నరసింహరావు వంటి దర్శకుల చిత్రాల్లో నరేష్ బాగా కనిపించేవవాడు. 1970లో వచ్చిన రెండు కుటుంబాల కథ, 19872లో వచ్చిన పండంటి కాపురం అనే చిత్రాల్లో నరేష్ బాల నటుడిగా చేశాడు. ఆ తర్వాత తన తల్లి విజయ నిర్మల దర్శకత్వంలో 1982లో వచ్చిన ప్రేమ సంకెళ్లు సినిమా ద్వారా హీరోగా పరిచయం అయ్యాడు.
సీనియర్ నటి,దర్శకురాలు అయిన విజయనిర్మల కొడుకుగా సినిమాల్లోకి వచ్చిన ఈయన.. తన స్వయంకృషితోనే సొంత ఇమేజ్ ని క్రేయేట్ చేసుకోవటంలో సక్సెస్ అయ్యాడు. అయితే నరేష్ వైవాహిక జీవితంలో అనేక అటు పోట్లను చూసాడు.నరేష్ ఏకంగా మూడు పెళ్ళిళ్ళను చేసుకున్నాడు. నరేష్ వ్యక్తిగత జీవితం చాలా విచిత్రంగా ఉంటుంది. మొదట నరేష్ సీనియర్ సినిమా కెమరామెన్ శ్రీనివాసరావు కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికి ఓ కొడుకుపుట్టాక పుట్టాక నరేష్ భార్యతో విభేదాలు రావటంతో విడిపోయారు. అనంతరం రెండో పెళ్లి చేసుకున్నాడు.
ప్రఖ్యాత రచయత దేవులపల్లి కృష్ణ శాస్త్రి మనవరాలు రేఖ సుప్రియను వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక అబ్బాయి పుట్టాక కలతలు ప్రారంభం అయ్యాయి. దాంతో మళ్లీ కొంత కాలానికి విడిపోయారు. ఆ తర్వాత 50 ఏండ్ల వయసులో నరేష్ మూడో వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు రమ్య రఘుపతి.ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు సీనియర్ రాజకీయ నాయకుడు రఘువీరా రెడ్డి సోదరుని కుమార్తె రమ్య రఘుపతి. ఇండియాలో చదువు పూర్తి అయ్యాక ఆస్ట్రేలియాలో ఫిలిం మేకింగ్ కోర్స్ పూర్తి చేసింది. అతనికి ముగ్గురు కుమారులు ఉన్నారు మరియు వాళ్లతో నివసిస్తున్నారు.