టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ 14 వరుస ప్లాపుల తర్వాత వరుస హిట్లతో ఇప్పుడిప్పుడే ట్రాక్ లోకి వస్తున్నాడు. ఇష్క్, గుండెజారి ఘల్లంతయ్యిందే సినిమా నుంచి నితిన్ కెరీర్ కాస్త పుంజుకుంది. ఇక గతేడాది లాక్ డౌన్‌కు ముందు వచ్చిన ఈ సినిమా నితిన్ కెరీర్‌లోనే తిరుగులేని హిట్ సినిమాగా నిలిచింది. రష్మిక మందన్న హీరోయిన్గా నటించింది. ఇక ఈ సినిమా తర్వాత వచ్చిన రంగ్ దే బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది. అయితే బుల్లితెరకు వచ్చే సరికి మాత్రం భీష్మ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాపై సైతం రంగ్ దే పై చేయి సాధించింది.
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా జీ తెలుగులో రీసెంట్ గా రంగ్ దే సినిమాను ప్రసారం చేయగా అది ఏకంగా 7 టీఆర్ఫీనీ దక్కించుకుంది. విచిత్రం ఏంటంటే అంతకు ముందే జెమినీ ఛానెల్‌లో భీష్మను ప్రసారం చేస్తే ఆ సినిమాకు 6.65 రేటింగ్ మాత్రమే వచ్చింది. నిజానికి ఈ సినిమాలు టీవీలో ప్రసారం చేయడానికి ముందే జీ5 యాప్‌లో స్ట్రీమింగ్ కు పెట్టారు.. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన భీష్మ కంటే బుల్లి తెరపై రంగ్ దే ను ఎక్కువ మంది ప్రేక్షకుల నుంచి ఆదరణ దక్కింది.
ఆ మాటకు వస్తే ఇలా జరగడం గతంలో కూడా చాలా సార్లు చూశాం. మహేష్ బాబు డిజాస్టర్ ఖలేజా బుల్లితెర మీద ఇన్నేళ్లకు ప్రసారం చేసినా కూడా 5 – 8 మధ్యలో టీఆర్పీ రాబట్టుకుని సంచలనాలు క్రియేట్ చేస్తోంది. ఇక వెండితెరపై యావరేజ్‌గా ఆడిన అతడు సినిమా సైతం బుల్లితెరపై ఎన్నో సార్లు ఊపేసిన సంగతి తెలిసిందే.