Moviesవిజయ్ దేవరకొండ సినిమాను రిజెక్ట్ చేసిన ఆ ముగ్గురు స్టార్ హీరోయిన్లు...

విజయ్ దేవరకొండ సినిమాను రిజెక్ట్ చేసిన ఆ ముగ్గురు స్టార్ హీరోయిన్లు వీళ్లే..రీజన్ తెలిస్తే మైండ్ బ్లాకే..!!

శ్రీరస్తు శుభమస్తు సినిమాతో మంచి మార్కులు అందుకున్న పరశురామ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న మూవీ “గీత గోవిందం”. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ – రష్మిక కాంబినేషన్ లో వచ్చిన గీత గోవిందం ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పల్సిన పనిలేదు. 2018లో టాలీవుడ్ కి లభించిన బ్లాక్ బస్టర్ హిట్స్ లో ఈ సినిమా ఒకటి అనడంలో అతిశయోక్తి లేదు.

టాలీవుడ్ లో ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ఏకంగా 100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిందంటేన్మే ఈ సినిమా ఎంత హిట్ అయ్యొందో మనం అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమా విజయ్ – రష్మికలను స్టార్లుగా మార్చేసింది. అంతేకాదు.. నిర్మాత అల్లు అరవింద్ కు ట్రిపుల్ టైమ్ ప్రాఫిట్స్ వచ్చాయి. అలాగే దర్శకుడు పరశురామ్ కు కెరీర్ స్పాన్ ను ఇచ్చింది. ముఖ్యంగా హీరోయిన్ రష్మికకు ఈ సినిమా సూపర్ బూస్టప్ ఇచ్చిందనే చెప్పాలి.

అయితే ఈ సినిమా లో మొదట హీరోయిన్ గా.. రష్మిక కంటే ముందు గీత పాత్ర మరో ముగ్గురు హీరోయిన్లకు చెప్పారట. దర్శకుడు పరశురామ్ మొదట గీత పాత్రకు.. రకుల్ ప్రీత్ సింగ్ ను సంప్రదిస్తే.. అప్పటికే ఆమె హిందీ సినిమాకు డేట్స్ కేటాయించడంతో ఈ సిన్మా వదులుకుందట.

ఆ తర్వాత అను ఇమ్మానియేల్ ను సంప్రదిస్తే తాను కూడా మన బన్నీ పక్కన నా పేరు సూర్య.. సినిమాకు పని చేస్తూ డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయిందట. దీంతో మూడొ ఛాన్స్ గా పరశురామ్ రాశి ఖన్నాను సంప్రదిస్తే.. ఆమె కూడా ఈ సినిమాను కాదనుకుని నితిన్ సినిమా శ్రీనివాస కల్యాణంకు సైన్ చేసిందట.

అలా అలా ఈ సినిమా అటు తిరిగి ఇటు టిరిగి ..ఆ ముగ్గురు భామలు కాదంటే వచ్చిన ఈ అవకాశాన్ని రష్మిక కరెక్ట్ గా సద్వినియోగం చేసుకుంది. ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. గీత గోవిందంను తెరకెక్కించిన పరశురామ్ ఈ సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ గా మార్చేశాడు. దీంతో రష్మిక స్టార్ హీరోయిన్ అయిపోయింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news