Movies"సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" సినిమాను రిజక్ట్ చేసిన స్టార్ హీరో...

“సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” సినిమాను రిజక్ట్ చేసిన స్టార్ హీరో ఇతనే..!!

బూతు ఉంటే మరింతగా సినిమా హిట్ అవుతుంది అని ఇండస్ట్రీ బాగా నమ్మే సిట్యువేషన్ లో.. ఈ రోజుల్లో ట్రెండ్ ని విభేదిస్తూ…. ఉమ్మడి కుటుంబం, అన్నదమ్ములు, బంధాలు, బాంధవ్యాలు, సంప్రదాయలు వీటిచుట్టూ అల్లిన కథాంశంతో “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు..” సినిమా తియ్యటం సాహసమే. అందులోనూ హీరోల ఫ్యాన్స్ ఎవేర్ నెస్ పెరిగిన నేపధ్యంలో ఎవరినీ నొప్పించకుండా మల్టి స్టారర్ చిత్రం రూపొందించి, ఒప్పించటం నిజంగా కత్తి మీద సామే. అటువంటి అరుదైన ఫీట్ చేసారు దిల్ రాజు.

కొత్త బంగారులోకంతో పరిచయం అయిన దర్శకుడు అండతో తెరపై అందరూ మర్చిపోతున్న మన లోకాన్ని మరోసారి స్పృశించి, గుర్తు చేసే ప్రయత్నం చేసారు. అయితే మరీ స్లో నేరషన్ కావటం మైనస్ అయిన ఈ చిత్రానికి మహేష్, వెంకటేష్ ల మధ్య వచ్చే సన్నివేశాలే బలంగా నిలిచాయి. పూర్తి గోదావరి యాసతో రూపొందిన ఈ చిత్రం ఓ కొత్త అనుభూతిని ఇచ్చింది.

వెంకటేష్, మహేష్ బాబు.. కలిసి నటించిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ లో దీనికి సెపరేట్ ట్రెండ్ ఉందని చెప్పాలి. టాలీవుడ్ లో ఇప్పుడు వరుసగా మల్టీ స్టారర్ సినిమాలు వస్తున్నాయి అంటే.. దానికి ప్రేరేపణ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రానికి దర్శకుడు.

2013వ సంవత్సరం జనవరి 11న సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ చిత్రంలో హీరోల పాత్రలకు పేర్లు ఉండవు. సినిమాలో వీళ్ళని పెద్దోడు, చిన్నోడు అనే పిలుస్తుంటారు. వెంకటేష్ పాత్రని పెద్దోడు అని .. అతని తమ్ముడు మహేష్ పాత్రని చిన్నోడు అని పిలుస్తుంటారు.

ఈ చిత్రంలో ప్రముఖ తెలుగు సినీనటులు వెంకటేష్, మహేశ్ ‌బాబు ముఖ్య పాత్రలు పోషించారు. వీరితో పాటు ఇతర ముఖ్య పాత్రలలో సమంత, అంజలి, ప్రకాశ్ రాజ్, జయసుధ నటించారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు కథను రాసుకున్నప్పుడు , హీరోల తండ్రి పాత్రకు మొదట ఒక సూపర్ స్టార్ దగ్గరకు ఈ కథ వెళ్ళిందట. కానీ కొన్ని అనుకోని కారణాల చేత ప్రకాష్ రాజ్ ఆ పాత్ర చేశాడు. అయితే మొదట తండ్రి పాత్ర కోసం రజనీకాంత్ ను సంప్రదించగా , కానీ ఎందుకో కొన్ని కారణాల చేత ఆయన తిరస్కరించడంతో, తిరిగి ప్రకాష్ రాజ్ కు ఆ ఛాన్స్ ను ఇచ్చారు.

ఇక ఆ పాత్ర తీసుకున్న ప్రకాష్ రాజ్ ఎక్కడా మిస్ చేయకుండా, అనుకున్న దాని కంటే ఎక్కువ స్థాయిలో నటించి ప్రేక్షకులను బాగా మెప్పించాడు. ఇందులో ఈయన చెప్పే ప్రతి మాట ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి అని చెప్పవచ్చు. ఈ పాత్రకు ప్రకాష్ రాజ్ మాత్రమే పూర్తి న్యాయం చేయగలరు అనడంలో ఎటువంటి సందేహం లేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news