Moviesద్యావుడా.. వీళ్లు బలం కోసం ఆ జంతువు రక్తం గుటగుట తాగేస్తారట..!!

ద్యావుడా.. వీళ్లు బలం కోసం ఆ జంతువు రక్తం గుటగుట తాగేస్తారట..!!

టాలీవుడ్ లో రామ్, లక్ష్మణ్ అంటే తెలియని వారు ఉండరు.. ఫైట్ మాస్టర్ లుగా అందరికి వీరు సుపరిచితులే..వారితో పనిచేసిన వారికి ఇప్పటికి రామ్, లక్ష్మణ్ ని గుర్తుపట్టడం కష్టంగా ఉంటుంది! రూపులోనే కాదు.. వినయంలోనూ ఇద్దరికి ఇద్దరూ సాటే అని అనిపించుకుంటున్నారు. దశాబ్దాల కాలం టాలీవుడ్ లో వీరిద్దరూ ఫైట్ మాస్టర్స్ గా కొనసాగుతున్నారు.

ఈ అన్నదమ్ములిద్దరూ కలసి ఫైట్స్ కంపోజ్ చేసిన ఎన్నో చిత్రాలు ఘాన విజయం సాధించాయి. టాలీవుడ్ సినిమాకు ఎన్నో ఏళ్లుగా సేవ‌లు చేస్తూ వ‌స్తున్నారు రామ్ ల‌క్ష్మ‌ణ్‌. ఫైట్ మాస్ట‌ర్స్‌గా పెద్ద హీరోల సినిమా నుండి చిన్న హీరోల సినిమాల వ‌ర‌కు ప‌ని చేశారు. ఫైట్ కంపోజింగ్‌లో ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త విధానాలను అవ‌లంభిస్తూ ప్రేక్ష‌కుల‌ని ఎంట‌ర్‌టైన్ చేస్తూ వ‌స్తున్న రామ్ ల‌క్ష్మ‌ణ్‌లు తాజాగా క్రాక్ సినిమాలోని ఫైట్ గురించి కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు.

దర్శకుడు చెప్పే కథలో నుంచే కొత్తదనం పుట్టుకొస్తుందని.. అలా వచ్చిందే క్రాక్ సినిమాలోని గాడిద రక్తం ఫైట్ అని అంటున్నారు టాలీవుడ్ నెంబర్ 1 ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్‌లు. మారిన పరిస్థితులు.. టెక్నాలజీతో తాము కూడా డిఫరెంట్‌గా ఆలోచిస్తున్నామని.. ఫైట్స్ కంపోజ్‌లో కూడా మార్పులు వస్తున్నాయని అంటున్నారు రామ్ లక్ష్మణ్‌ మాస్టర్లు.

ఇక క్రాక్ సినిమా ఫైట్స్‌కి మంచి పేరు రావడంతో పాటు ఆ సినిమాలోని బీచ్ ఫైట్ అంత బాగా వచ్చిందంటే.. అందులో తమ పర్సనల్ అనుభవాలు ఉండటం వల్లే అని అంటున్నారు రామ్ లక్ష్మణ్‌ మాస్టర్లు. అయితే దీనిపై వారు మాట్లాడుతూ.. క్రాక్ సినిమాలో బీచ్ పక్కన ఉండే ఒక మూర్ఖపు బ్యాచ్‌ని ఎంత క్రూరంగా చూపించాలో అంత క్రూరంగా చుపించామన్నారు.

ఈ ఫైట్ అద్భుతంగా రావ‌డానికి ప్రేర‌ణ ఉంది. చీరాలలో మేం కూడా గాడిద రక్తం తాగి పరుగుపెట్టేవాళ్లం. ఫైటర్స్‌గా ఉన్నప్పుడు గాడిద రక్తం తాగేవాళ్లం. ఇంటికి మంచిద‌ని గాడిద రక్తం తాగుతుంటారు. చీరాలలో స్టువర్ట్ పురం అనే ఒక ఏరియా ఉండేది.. ఆ ఏరియాలో ఎక్కువగా దొంగతనాలు జరిగేవి.ఆ దొంగ‌ల‌ని పోలీసులు భీబ‌త్సంగా కొట్టేవారు.అందుకోసం దొంగ‌లు గాడిద ర‌క్తం తాగి, స‌మురు రాసుకొని ప‌రిగెత్తే వారు.

గాడిద రక్తం తాగితే పోలీసులు కొట్టిన దెబ్బల వల్ల వచ్చే నొప్పులు పోతాయట‌. అలా వాళ్లు మళ్లీ ఒకటి రెండు నెలల్లో మళ్లీ దొంగతనాలు మొదలుపెట్టేవారు. మాకు కూడా గాడిద ర‌క్తంతో అనుభ‌వం ఉంద‌ని రామ్ ల‌క్ష్మ‌ణ్ అన్నారు

 

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news