Moviesఆర్థిక ఇబ్బందులతో ఆగిపోయిన తెలుగు సినిమాలు ఇవే..!!

ఆర్థిక ఇబ్బందులతో ఆగిపోయిన తెలుగు సినిమాలు ఇవే..!!

అభిమాన కథానాయకుడి నుంచి కొత్త చిత్రం వస్తుందంటే అభిమానుల్లో ఉండే సందడే వేరు. ఒకప్పుడు ఆ సినిమా విశేషాలను తెలుసుకునేందుకు పత్రికలు, సినీ మ్యాగజైన్లు తిరగేస్తే…ఇప్పుడైతే వెబ్‌సైట్లు, యూట్యూబ్‌ ఛానళ్లు, సామాజిక మాధ్యమాల్లో వెతికేస్తున్నారు. అలాంటిది ఆ సినిమా ఆగిపోయిందని తెలిస్తే, ఉసూరుమంటారు.

ఏ ఇండస్ట్రీలోనైనా ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి. మన తారలకు సంబంధించి కొన్ని సినిమాలు కొబ్బరికాయ కొట్టాక, ఇంకొన్ని సినిమాలు చర్చలు పూర్తయి ఆఖరి దశలో ఆగిపోయాయి.మరి ఆ చిత్రాలేవో ఓసారి చూసేద్దామా!

చిరంజీవి – అంజి:
2004 జనవరి 15వ తేదీన కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో, చిరంజీవి హీరోగా, నమ్రతా శిరోద్కర్ , టినూ ఆనంద్ లు హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా 1998 లోనే షూటింగ్ ప్రారంభమైంది. కానీ ఆర్థిక సమస్యలు ఎదురవడంతో తిరిగి 2004లో విడుదల చేశారు.

గోపీచంద్ – ఆరడుగుల బుల్లెట్:
టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్, తెలుగులో ‘సమర సింహా రెడ్డి’, ‘నరసింహనాయుడు’, ’ఇంద్ర’ వంటి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన దర్శకుడు బి.గోపాల్ కలయికలో వచ్చిన పూర్తి స్థాయి యాక్షన్ చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్’. అపుడెపుడో నాలుగేళ్ల క్రితం థియేటర్స్‌లో విడుదల కావాల్సిన ఈ సినిమా ఫైనాన్షియల్ కారణాల వల్ల విడుదల కాలేదు. మధ్యలో ఈ సినిమా రిలీజ్ చేయడానికి చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. మధ్యలో ఈ సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ అవేవి వర్కౌట్ కాలేదు.

 

నాగార్జున ఢమరుకం:
నాగార్జున నటించిన డమరుకం చిత్రం కూడా రెండు సంవత్సరాల పాటు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది.

ప్రభాస్ – రెబల్:
2012 సెప్టెంబర్ 28న రాఘవ లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రెబల్. అయితే ఈ చిత్రం కూడా విడుదలకు ముందు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో సినిమా ఆలస్యంగా విడుదలైంది.

బాలకృష్ణ – మహారథి:
2007 లో పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఇది. ఇందులో బాలకృష్ణ హీరోగా మీరాజాస్మిన్, స్నేహా హీరోయిన్ లుగా నటించారు. ఈ సినిమా కూడా రిలీజ్ కు ముందు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని, కొన్ని సంవత్సరాల పాటు ఆగిపోయింది.

నాగచైతన్య-ఆటోనగర్ సూర్య:
నాగచైతన్య నటించిన ఆటోనగర్ సూర్య కూడా రెండు సంవత్సరాల పాటు ఆర్థిక ఇబ్బందులలో మునిగి తిరిగి విడుదలైంది. వీరే కాదు, రామ్‌చరణ్‌ ‘మెరుపు’, కొరటాల దర్శకత్వంలో మరో చిత్రం, మహేశ్‌-పూరిల ‘జనగణమన’, ఎన్టీఆర్‌-లారెన్స్‌ చిత్రం ‘పేదోడు’…ఇలా పలు సినిమాలు దాదాపు ఒకే అయినా, సెట్స్‌పైకి వెళ్లలేకపోయాయి. ఇవే కాదు, చర్చల దశలోనే ఆగిపోయిన సినిమాలు ఇంకెన్నో ఉంటాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news