తెలుగు హీరోలు ఇతర భాషల్లో నటించడం అరుదుగా జరుగుతుంటుంది. నాగార్జున అప్పుడెప్పుడో ఓ సారి రక్షకుడు సినిమాతో తమిళంలోకి నేరుగా వెళ్లాడు. రజినీ మాపిళ్ళై సినిమాలో చిరు చిన్న పాత్రలో మెరిసాడు. అయితే తమిళ హీరోలు మాత్రం నేరుగా తెలుగులో నటించారు. నాటి రజినీకాంత్, కమల్ హాసన్ నుంచి నేటి విజయ్, విజయ్ సేతుపతి వరకు దాదాపు 15 మంది హీరోలు తెలుగులో నేరుగా నటించారు.
ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరోల కన్ను టాలీవుడ్ పై పడింది. ఇప్పటి వరకు తమ సినిమాలను తెలుగులోకి డబ్ చేసుకుని సూపర్ హిట్స్ అందుకున్న హీరోలు ఇప్పుడు.. నేరుగా తెలుగులో సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే తమిళ హీరోలు, విజయ్, ధనుష్‌లు తమ తెలుగు సినిమాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరితోపాటు మరికొందరు హీరోలు కూడా టాలీవుడ్లో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
అయితే….మన తెలుగు స్టార్ హీరో లను తమిళ ప్రేక్షకులు పెద్దగా ఆదరించకపోయినప్పటికీ.. మన తెలుగు ప్రేక్షకులకు మాత్రం సినిమాలో కంటెంట్ బాగా నచ్చితే తప్పకుండా ఆదరిస్తారు. అలా కోలీవుడ్ నుంచి వచ్చి తెలుగులో డైరెక్ట్ గా సినిమాలు చేసిన స్టార్స్ ఎంతమంది ఉన్నారు. అలా డైరెక్ట్ గా తెలుగులో సినిమాలు తీసిన తమిళ హీరోలు ఎవరో చూద్దాం..!!
కమలహాసన్: ఇంద్రుడు చంద్రుడు, గుప్పెడు మనసు, ఆకలిరాజ్యం, స్వాతిముత్యం, అమర ప్రేమ, సొమ్మొకడిది సోకొకడిది , అంతులేని
కథరజినీకాంత్: కథానాయకుడు , పెదరాయుడు
విక్రమ్:9 నెలలు ,బంగారు కుటుంబం, ఆడాళ్ళ మజాకా, చిరునవ్వుల వరమిస్తావా, ఊహ, మెరుపు
అజిత్: ప్రేమ పుస్తకం
సూర్య: రక్త చరిత్ర , రక్త చరిత్ర 2
సిద్ధార్థ్: నువ్వొస్తానంటే నేనొద్దంటానా