వైవిధ్యమైన కథతో సినిమాలను అందించడంలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అ, కల్కి, వంటి సినిమాలతో దర్శకుడిగా సత్తా చాటిన ప్రశాంత్ వర్మ ఇటీవలె తేజ సజ్జాను హీరోగా పరిచయం చేశారు. జాంబీ రెడ్డితో తొలిసారిగా సౌత్‌లో జాంబీ జోనర్‌ను ప్రేక్షకులకు పరిచయం చేశాడు ప్రశాంత్ వర్మ. ‘అ!’ అనే అద్భుతమైన సినిమా తీసి తొలి సినిమాతోనే తన టాలెంట్ బయటపెట్టిన ప్రశాంత్ వర్మ.. దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రెండో సినిమాగా రాజశేఖర్‌తో ‘కల్కి’ సినిమా చేసి ఆ తర్వాత ‘జాంబి రెడ్డి’ మూవీ రూపొందించిన ఆయన, తన డైరెక్షన్లో ఓ విభిన్నమైన క్వాలిటీ ఉంటుందని నిరూపించుకున్నారు.
ఇక తాజాగా ఓ షోలో పాల్గొన్న ఈయన కొన్ని విషయాలు పంచుకున్నాడు.ఈ నేపథ్యంలో తరుణ్‌భాస్కర్ హోస్ట్‌గా బుల్లితెరపై ప్రసారమవుతున్న ‘మీకు మాత్రమే చెప్తా’ ప్రోగ్రాంలో పాల్గొన్న ఆయన కెరీర్‌కి సంబంధించిన పలు విషయాలు చెప్పారు. ఇండస్ట్రీలో తన ఎదుర్కొన్న ఒకట్రెండు చేదు అనుభవాల గురించి ఆయన ఇంటర్వ్యూలో వివరించారు. “ఓ హీరోకు కథ చెప్పడానికి వాళ్ల ఇంటికి వెళ్లాను. అక్కడికి చేరుకోగానే పెద్ద వర్షం మొదలైంది.
దీంతో నేను గేటు బయటే ఉండి ఆయనకు కాల్ చేశాను. అయినా నన్ము లోపలికి రమ్మనకుండా అలానే వర్షంలో వెయిట్ చేయించాడు. ఆ రోజు వర్షంలో నేను తడిసిపోతూ, ఆయన ఇంటివైపు చూస్తూ నిలబడ్డాను. కనీసం లోపలికి పిలవకుండా గేటు బయట వర్షం లో నిలబెట్టిన ఆ హీరో పై ఎంతగానో కోపం వచ్చినప్పటికీ తమాయించుకుని వెళ్లి ఆ హీరోకి కథ చెప్పి వచ్చాడట ప్రశాంత్ వర్మ. ఆ తర్వాత ఆ హీరోతో కలిసి సినిమా కూడా చేశానని ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చాడు.
అయితే ప్రశాంత్ వర్మ తీసింది మూడే సినిమాలు. అ!, కల్కి, జాంబి రెడ్డి సినిమా. ఈ మూడు సినిమాలలో ప్రశాంత్ వర్మ పెద్ద హీరోతో పని చేసిన ఏకైక సినిమా కల్కి కావడంతో, ప్రశాంత్ వర్మ ని ఆ విధంగా అవమానించిన హీరో డాక్టర్ రాజశేఖర్ అయి ఉండవచ్చన్న విశ్లేషణలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.