Moviesపెళ్లికి ముందే ప్రెగ్నెంట్‌ అయిన స్టార్ హీరోయిన్స్ వీళ్లే..వామ్మో లిస్ట్ పెద్దదేనండోయ్..!!

పెళ్లికి ముందే ప్రెగ్నెంట్‌ అయిన స్టార్ హీరోయిన్స్ వీళ్లే..వామ్మో లిస్ట్ పెద్దదేనండోయ్..!!

విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకున్న సంప్రదాయాల్లో సహజీవనం ఒకటి. ఆర్ధికంగా వెనుకబడిన కుటుంబాల వారు దీనిని పూర్తిగా వ్యతిరేకించినా, ఉన్నత చదువులు అభ్యసించిన వారు, సమాజంలో పలుకుబడి ఉన్న సెలబ్రిటీలు ఈ కల్చర్ ని ఫాలో అవుతుంటారు. సినీ రంగంలో కూడా సహజీవనం చేసేవారు కొంతమంది ఉన్నారు. ఇద్దరికీ బేధాభిప్రాయాలు రానంతవరకు కలిసి ఉండి, ఆతర్వాత విడిపోతున్నారు.

పెళ్లి ఏముందిలే ఒక్క రోజులో అయిపోతుంది. కావలసిన అన్ని రోజులు జాలీగా లైఫ్ లో ఫన్ మిస్ అవ్వకుండా ఎంజాయ్ చేసిన తర్వాత పెళ్లి చేసుకోవాలి అనుకునే వారి సంఖ్య సినిమా వాళ్ల‌లో పెరుగుతుంది. ఈ నేప‌థ్యంలోనే ప‌లువురు సినీ తార‌లు డేటింగ్ లో బిజీగా గ‌డుపుతున్నారు. పలువురు హీరోయిన్స్ పెళ్లికి ముందే లివింగ్ రిలేషన్ షిప్ లో ఉంటూ ప్రెగ్నెంట్ అయిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ స్టార్స్ ఎవరో మనం చూద్దాం…

శ్రీదేవి: ఇండియన్ సినిమా లెజెండ్రీ హీరోయిన్ గా.. అతి లోకసుందరిగా పేరు దక్కించుకున్న శ్రీదేవి బోనీకపూర్ ను వివాహం చేసుకోక ముందే ప్రెగ్నెంట్ అయ్యిందంటూ పెళ్లి సమయంలో మీడియాలో వార్తలు వచ్చాయి. బోనీకపూర్ తో పెళ్లి సమయంలో శ్రీదేవి ఏడు నెలల గర్బవతి అంటూ ప్రచారం జరిగింది.

రేణు దేశాయ్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ..బద్రి సినిమాలో తనతో నటించిన రేణు దేశాయ్ తో సహజీవనం చేశారు. వీరిద్దరికీ 2004 లో అకీరా పుట్టాడు. అప్పుడు తల్లి దండ్రులు అయిన వీరిద్దరూ 2009 లో పెళ్లి చేసుకుని భార్య భర్తలయ్యారు.

సారిక: హీరోయిన్ సారిక కూడా పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయ్యింది. యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ తో ఈమె చాలా సంవత్సరాల పాటు ప్రేమాయణం సాగించింది. ఆ సమయంలో వీరిద్దరు సహజీవనం కూడా సాగించారు. అప్పుడే సారిక ప్రెగ్నెంట్ అయ్యింది. దాంతో వెంటనే సారిక.. కమల్ హాసన్ లు పెళ్లి చేసుకున్నారు.

వీరు మాత్రమే కాకుండా ఇంకా పలువురు హీరోయిన్స్ కూడా పెళ్లికి ముందే గర్బవతులు అయ్యారు. కొందరు మ్యానేజ్ చేస్తే మరికొందరు మాత్రం రహస్యంగా ఉంచేందుకు ప్రయత్నించారు. అయితే ఎక్కువ శాతం ప్రెగ్నెంట్ అయిన హీరోయిన్స్ వెంటనే పెళ్లి చేసుకున్నారు. ముందు ముందు ఇలాంటివి ఎన్ని చూడాల్సి వస్తుందో..!

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news