రాధిక 1970 – 80వ దశకంలో తిరుగులేని హీరోయిన్. అప్పట్లో సౌత్‌లో అన్ని భాషల్లో స్టార్ హీరోల పక్కన నటించిన రాధిక వ్యక్తిగత జీవితం మాత్రం ఎన్నో ఒడిదుడుకుల్లో పడింది. రాధిక ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకుంది. ముందుగా ఆమె మళయాళ దర్శకుడు ప్రతాప్ పోతన్‌ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఓ బ్రిటీషర్‌ను పెళ్లి చేసుకుని లండన్‌లో సెటిల్ అయ్యింది. ఈ దంపతులకు ఓ పాప పుట్టాక మనస్పర్థలు రావడంతో అతడికి కూడా ఆమె విడాకులు ఇచ్చి చెన్నైకు వచ్చేసింది.
ఆ తర్వాత ఆమె ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు చాలా అప్పులు చేసేశారు. చివరకు పలు సార్లు చెక్ బౌన్స్ కేసుల్లో కూడా ఇరుక్కున్నారు. తెలిసిన వారి దగ్గర భారీగా అప్పులు చేశారు. అయితే ఆ తర్వాత రాడాన్ బ్యానర్ స్థాపించి సీరియల్స్ నిర్మిస్తూ, నటించడంతో క్రమక్రమంగా నిలదొక్కుకున్నారు. ఆ తర్వాత ఆమె శరత్‌కుమార్‌ను మూడో పెళ్లి చేసుకున్నారు. అప్పటికే భార్యకు దూరమైన శరత్ కుమార్ రాధికను అన్ని విధాలా ఆదుకున్నారు. చివరకు వారు జీవితంలో కూడా ఒక్కటి అయ్యారు.
ఓ విధంగా చెప్పాలంటే అప్పుల్లో కూరుకుపోయిన రాధికను.. శరత్ కుమార్ ఆదుకున్నారని. ఆ క్రమంలోనే వీరిద్దరి మనస్సులు కలిసి చివరకు పెళ్లి కూడా చేసుకున్నారని ఓ టాక్ ఉంది. ఇక సెకండ్ ఇన్సింగ్స్‌లో శరత్ కుమార్ కూడా పలు కీలక పాత్రలు పోషిస్తూ భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఇక ఇప్పుడు వీరు బాగా సెటిల్ అయ్యారు.