స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగి.. సినీ ఇండస్ట్రీని ఏలేసి..ఆ తరువాత అక్కినేని వారింట కోదలిగా అడుగుపెట్టింది సమంత. నాగార్జున పెద్ద కొడుకు నాగ చైతన్యను పెళ్లాడిన ఆమె మ్యారేజ్ తర్వాత అక్కినేని అనే బ్రాండ్‌తో మరింత పాపులారిటి పెమొచుకుని తనదైన స్టైల్ లో దూసుకుపోతుంది.
సినిమాలు ఒక్కటే కాదండోయ్.. వ్యాపారాలు, ఫ్యాషన్ ఇలా అన్నింటా నేనే నెం.1 అంటూ ముందన్నట్లుగా హవా నడిపిస్తోంది ఈ అక్కినేని కోడలు పిల్ల. మరీ ముఖ్యంగా పెళ్లి తర్వాత తనకు నచ్చినట్లుగా ఉంటూ అక్కినేని కోడలి రూటే సపరేటు అనిపించుకుంటోంది. ఫ్రీ టైం దొరికిన ప్రతిసారి భర్త నాగ చైతన్యతో రొమాంటిక్ టూర్స్ వేస్తూ ఉంటుంది.అంతేనా.. ఆయా ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేయడం సమంత హ్యాబీ.
ఇక తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన నారప్ప సినిమా నిన్న ఓటీటీ వేదికగా విడుదల అయిన విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి నేపథ్యంలో వెంకటేష్ నటించిన ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేసింది చిత్రబృందం. కాగా ఈ సినిమాపై అక్కినేని కోడలు సమంత తనదైన స్టైల్ లో స్పందించింది.
అక్కినేని సమంత తన ఇన్ స్టా గ్రామ్ స్టోరీస్ లో.. టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన “నారప్ప” సినిమాకు సంబంధించి పోస్టర్ ను పెట్టుకుంది. అంతేకాదు ఆ పోస్టర్ కు ఓ క్యాప్షన్ కూడా జత చేసింది. విక్టరీ వెంకటేష్ మరియు దగ్గుబాటి ని ఉద్దేశించి… వావ్…వావ్..వావ్.. అంటూ ఆ పోస్టర్ క్యాప్షన్ పెట్టి.. నారప్ప సినిమా గురించి చాలా సింపుల్ గా తన రివ్యూ రేటింగ్ ను ఇచ్చేసింది.