రెజీనా..ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆకట్టుకునే గ్లామర్ తో హాట్ హీరోయిన్ గా సినీ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకుంది. తొలి చిత్రం తోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రెజీనా.. ఆ తర్వాత టాలీవుడ్ లో వరుసగా అవకాశాలు అందుకుంది. ఆ తరువాత సరైన గుర్తింపు లేక బాలివ్డ్ చెక్కేసింది. ఇక తెలుగు ఇండస్ట్రీలో 9 ఏళ్ల నుంచి కొనసాగుతున్న కేవలం కుర్ర హీరోలతోనే ఈ అమ్మడు సినిమాలు చేసింది. ఏ స్టార్ హీరో సరసన చేసే ఛాన్స్ దక్కించుకోలేకపొయింది.
ఇక పిల్ల నువ్వు లేని జీవితం సినిమా లో హీరో సాయి ధరం తేజ్ తో నటించింది.. ఇక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో సాయిధరమ్ తేజ మొదటి సినిమా రేయ్ పెద్దగా విజయవంతం కాకపోయినా ఈ చిత్రానికంటే ముందే రిలీజ్ అయిన పిల్లా నువ్వు లేని జీవితం చిత్రం అదిరిపోయే హిట్ అందుకుంది.
ఆ తర్వాత సాయిధరమ్ తేజ మూడవ చిత్రం సుబ్రమణ్మం ఫర్ సేల్ చిత్రం కూడా సూపర్ డూపర్ హిట్ అందుకుంది..ట్విస్ట్ ఏంటంటే ఈ చిత్రంలో కూడా హీరోయిన్ రెజినా నే . సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమా లో వీళ్లిద్దరి జంట అదుర్స్ అనే చెప్పాలి .. ఇక ఈ ఇద్దరు జంట అద్భుతమైన విజయం సాధిస్తుందన్న టాక్ టాలీవుడ్ లో పాకిపోయింది.
అంతే కాదు ఈ ఇద్దరి కెమిస్ట్రీ కూడా బాగా వర్క్ఔట్ అయ్యిందని..ఇద్దరూ ప్రమలో పడ్డారని ఆ మద్య విపరీతంగా వార్తలు పుట్టుకొచ్చాయి.అంతేనా.. ఒకానొక్క దశలో ఈమె ఆ ఇంటి కాబోయే కోడలు అనే వార్తలు కూడా వినిపించాయి. వీళ్ళిద్దరు పెళ్ళి చేసుకోబోతున్నారని.. టాలీవుడ్ కోడై కూసింది. అయితే. సీన్ లోకి ఎంటరిన ఈ ఇద్దరూ మా మద్య ఎటువంటి ఎఫైర్ లేదని కేవలం మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పి ఈ గాసిప్స్ కి ఫుల్ స్టాప్ పెట్టేసారు.