Gossipsఆ లిస్ట్ లోకి చేరిపోయిన పవన్ కళ్యాణ్..?

ఆ లిస్ట్ లోకి చేరిపోయిన పవన్ కళ్యాణ్..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. వకీల్ సాబ్ తో మూవీతో బాక్స్ ఆఫిస్ ను షేక్ చేసారు. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ప్రజల సమస్యలపై స్పందించే విదంగా అడుగులు వేస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా సినిమాలతో కూడా బిజీబిజీగా గడుపుతున్నారు. వకీల్ సాబ్ అనంతరం వరుసగా నాలుగు సినిమాలకు కమిట్మెంట్ ఇచ్చాడు.

వకీల్ సాబ్’ తర్వాత వరుస సినిమాలతో బిజీ అయ్యారు పవన్ కళ్యాణ్. వాటిలో ఒకటి మరో భాషలో హిట్టయిన సినిమాకి రీమేక్ అయితే, పవన్ ఇంతవరకూ టచ్ చేయని పీరియాడిక్ జానర్ మరొకటి. ఈ రెండు సినిమాల విషయం అటుంచితే హరీష్ శంకర్ డైరెక్షన్‌‌‌‌లో పవన్ నటించబోయే సినిమాకి మాత్రం సెపరేట్ క్రేజ్ ఉంది.

ఎందుకంటే పవన్ నుండి ఫ్యాన్స్ ఆశించే అంశాలన్నీ హరీష్‌‌‌‌కి తెలుసు కనుక అవన్నీ ఆ సినిమాలో ఉంటాయని అభిమానుల నమ్మకం. పైగా ‘గబ్బర్ సింగ్’ సినిమాతో ఇప్పటికే ఓసారి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కాంబినేషన్ కావడంతో అనౌన్స్‌‌‌‌మెంట్ రోజు నుండే అంచనాలు ఓ స్థాయిలో ఉన్నాయి. వాటిని ఏమాత్రం తగ్గనీయకుండా తన సోషల్ మీడియా పోస్టులతో మరింత హైప్ ఇస్తున్నాడు హరీష్.

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఎప్పుడు, ఏ కొత్త అప్‌డేట్ వస్తుందా అని ఈగర్‌గా వెయిట్ చేస్తుంటారు వీరాభిమానులు. అయితే, పవన్ కళ్యాణ్ రీసెంట్‌గా ఓ లగ్జీరియస్ ఎస్‌యూవీ వెహికల్ కొన్నారనే వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. పవర్ స్టార్ మొదటిసారి ఒక ఖరీదైన కారును కొనుగోలు చేసినట్లు టాక్. సాధారణంగా పవన్ కార్లపై ఆస్తులపై పెద్దగా ఫోకస్ పెట్టడని అందరికి తెలిసిందే. ఇక మొదటిసారి ఆయన ఒక ఖరీదైన కారును బుక్ చేసుకున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.

ఎస్‌యూవీ రేంజ్ రోవర్ 3.0 మోడల్ న్యూ కార్ ఆర్డర్ చేశారట పవర్‌స్టార్.. దాని కాస్ట్ అక్షరాలా 4 కోట్లు.ఆ కారు కూడా పవన్ పేరు మీద బుక్ చేయబడినందునట్లుగా టాక్ వస్తోంది. హైదరాబాద్ లో కొద్దిమంది ప్రముఖులు మాత్రమే రేంజ్ రోవర్ 3.0 ఎస్‌వి ఆటోబయోగ్రఫీని కొనుగోలు చేశారు. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ క్లబ్‌లో చేరాడు.

ప్రభాస్, అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్, అల్లు అర్జున్, రణబీర్ కపూర్‌ వంటి వారు దేశంలోనే అత్యంత విలువైన లగ్జరీ రేంజ్ రోవర్ ఎస్‌యూవీలను మెయింటైన్ చేస్తున్నారు. ఆ కారును పవన్ కేవలం తన పర్సనల్ ఫ్యామిలీ కోసం కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇక ఆ లిస్టులో ఇప్పుడు పవన్ కూడా చేరిపోయాడు. అద్భుతమైన ఫీచర్స్‌తో, స్టైలిష్ అండ్ రాయల్‌గా ఉండే ఈ కార్‌లో పీకే ఎప్పుడు కనిపిస్తారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్.

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news