యంగ్ టైగర్ఎన్టీఆర్, ఇండస్ట్రీలో క్రేజీ కాంబినేషన్స్ అనేవి కొన్ని మాత్రమే ఉంటాయి. అవి హీరో-హీరోయిన్ అవ్వొచ్చు.. హీరో- డైరెక్టర్ అవ్వొచ్చు. అలాంటి క్రేజీ కాంబినేషన్‌లో ఎన్టీఆర్- రాజమౌళి ఒకటి. వీరి కాంబినేషన్‌లో ఇప్పటివరకు వచ్చిన మూడు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అంతేకాకుండా అటు ఎన్టీఆర్‌కి మాస్ హీరోగా, రాజమౌళికి స్టార్ డైరెక్టర్‌గా పేరు తీసుకొచ్చింది ఈ సినిమా. ఇది వీరి కాంబినేషన్‌లో వచ్చిన రెండో సినిమా.
రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన ’సింహాద్రి’ సినిమా విడుదలైన నేటితో 17 ఏళ్లు పూర్తి చేసుకుంది. అంతేకాదు ఈ చిత్రం అప్పటి వరకు ఉన్న ఎన్నో రికార్డులను తిరగ రాసింది. మొత్తంగా ఈ సినిమా సాధించిన రికార్డ్స్ చాలానే ఉన్నాయి. ఎన్టీఆర్ కెరీర్ ని ఓ రేంజ్ లో నిలిపిన సినిమా సింహాద్రి కి రీసెంట్ గా 18 ఏళ్ళు కంప్లీట్ అయ్యాయి. 20 ఏళ్ల వయసులోనే తన ఏజ్ కి మించిన రోల్ లో అద్బుతనటనను కనబరిచిన ఎన్టీఆర్ అప్పటి స్టార్ హీరోల౦దరికీ వణుకు పుట్టించాడు.
జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో సింహాద్రి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క సినిమాతో సూపర్ స్టార్ అయిపోయాడు నందమూరి చిన్నోడు. కేవలం 20 ఏళ్ళ వయసులో నెంబర్ వన్ కుర్చీ కోసం పోటీ పడ్డాడు. అప్పటికే స్టూడెంట్ నెంబర్ వన్, ఆది సినిమాలతో మంచి విజయాలు అందుకున్న జూనియర్ ఎన్టీఆర్.. సింహాద్రి సినిమాతో ఒక్కసారిగా హాట్ టాపిక్ అయిపోయాడు.
భూమిక, అంకిత హీరోయిన్స్ గా తెరకెక్కిన ఈ సినిమా 2003లో విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. విజయమారుతి క్రియేషన్స్ బ్యానర్ పై దొరస్వామిరాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సింహాద్రి సినిమా కి కీరవాణి సంగీతం అందించగా భానుచందర్, నాజర్, సీత, బ్రహ్మానందం, రాహుల్ దేవ్ తదితరులు ఇతర పాత్రలు చేసారు. అప్పట్లో ఈ మూవీ సాంగ్స్, బీజీఎమ్ కి ఎంతో క్రేజ్ లభించింది. ముఖ్యంగా నువ్వు విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి సాంగ్ అయితే పెద్ద సెన్సేషన్ సృష్టించింది.అప్పటి వరకు ఉన్న అన్ని ఇండస్ట్రీ రికార్డులను ’సింహాద్రి’ మూవీ ఈజీగా క్రాస్ చేసింది