Moviesహీరోయిన్ తో మిస్ బిహేవ్.. తన భర్తని కాల్చిపారేయమన్న సింగర్..!!

హీరోయిన్ తో మిస్ బిహేవ్.. తన భర్తని కాల్చిపారేయమన్న సింగర్..!!

చిరంజీవి,సుమలత జంటగా కె విశ్వనాధ్ డైరెక్షన్ లో వచ్చిన శుభలేఖ సినిమాలో సుధాకర్,తులసి మరో జంటగా నటించారు. ఇక ఈ సినిమాతో అదే ఇంటిపేరుగా ప్రచారంలోకి వచ్చిన శుభలేఖ సుధాకర్ .. మంత్రిగారి వియ్యంకుడు,ప్రేమించు పెళ్లాడు చిత్రాల్లో జంటగా నటించారు. ఎన్నో సినిమాల్లో నటించిన శుభలేఖ సుధాకర్ ఇక బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి ఎన్నో సీరియల్స్ లో నటించి తన నటనతో అందరికీ మరింత దగ్గరయ్యాడు.

ఇక గానగంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం సోదరి ఎస్పీ శైలజను వివాహమాడిన శుభలేఖ సుధాకర్ రెండుజళ్ళ సీత, సితార,మొగుడు పిల్లలు,స్వాతి లేడీస్ టైలర్ వంటి చిత్రాల్లో మంచి పాత్రల్లో నటించాడు. సిరివెన్నెల ,ముద్దుల మనవరాలు,గౌతమీ, గుండమ్మ గారి కృష్ణులు, భలేమొగుడు,అహ నా పెళ్ళంట, బంధువులొస్తున్నారు జాగ్రత్త,చెవిలో పువ్వు వంటి సినిమాల్లో చేసాడు. నిర్ణయం,పెళ్లి పుస్తకం,ఆదిత్య 369,వంటి సినిమాల్లో నటించిన శుభలేఖ సుధాకర్ కెరీర్ మొదట్లో కామెడీ పాత్రల్లో జీవించాడు.

క్యారెక్టర్ ఆర్టిస్టుగా, ఇప్పుడు తండ్రి పాత్రల్లో ఒదిగిపోతున్నాడు. అప్పుడప్పుడు నెగెటివ్ క్యారెక్టర్స్ చేస్తూ,ఇటు వెండితెర,అటు బుల్లితెరపై శుభలేఖ సుధాకర్ తనదైన ముద్ర వేసాడు. శుభలేఖ సుధాకర్ ,శైలజ లు పెళ్లి అయ్యాక కొన్ని రోజులు కష్టాలు పడ్డారు. ఆ తర్వాత జీవితంలో సెటిల్ అయ్యారు. ఆ కష్టాలకు ఎవరిని నిందించలేదు. అలాగే ఎవరిని సాయం అడగకుండా వారి పాట్లు వారు పడ్డారు. వీరికి ఒక అబ్బాయి ఉన్నాడు.

పీసీ.శ్రీరామ్ అనగానే దర్శకుడు మణిరత్నం సినిమాలు గుర్తుకు వస్తుంటాయి.ప్రేక్షకుల కల్లే తన కళ్లు గా భావించి.. పీసీ.శ్రీరామ్ అందమైన సృజనాత్మక,దృశ్యాలను తన కెమెరాలో బంధిస్తాడు. నాయకుడు, గీతాంజలి, దొంగ దొంగ లాంటి చిత్రాలకు పి.సి.శ్రీరామ్ కెమెరామెన్ గా పనిచేశారు. ఆ తర్వాత పీసీ శ్రీరామ్1995లో కమలహాసన్,అర్జున్ హీరోలుగా గౌతమి హీరోయిన్ గా ద్రోహి అనే చిత్రాన్ని తీయడం జరిగింది.

ద్రోహి 1995 లో విడుదలైన తెలుగు అనువాద చిత్రం. దీనిని కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ పి. సి. శ్రీ రామ్ దర్శకత్వం వహించిన సినిమా. హిందీ చిత్రం ద్రోహకాల్(1994) ని తెలుగులో ద్రోహి, తమిళంలో కురుతిపునల్ గా కమల్ పునర్మించారు. ఆది, అబ్బాస్ ఇద్దరు ప్రాణ స్నేహితులు. నిజాయితి గల పోలీస్ ఆఫీసర్స్. అబ్బాస్ ప్రతిపాదించిన సీక్రెట్ మిషన్ ధనుష్ కోసం ఇద్దరు సీక్రెట్ ఆఫీసర్లను టెర్రరిస్ట్ కమాండర్ భద్ర బృందంలో ప్రవేశపెట్టి వారి కదలికలను పసిగట్టాలనుకుంటారు.వారి పథకం అనుకున్నట్టు జరిగిందా? లేదా? అనేది మిగతా కథ.

P.C.శ్రీరాం సినిమాటోగ్రఫి సినిమాని రియలిస్టిక్ గా చూపించగలిగింది. సినిమాలో ప్రతిది సహజంగా నమ్మేవిధంగా మలచడంలో దర్శకుడు, రచయితల మార్క్ కనిపిస్తుంది. సినిమాలో చూపించిన సీక్రెట్ ఆపరేషన్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. తీవ్రవాద సమస్యను రెండు వైపులా చర్చించిన రియలిస్టిక్ సినిమా.అనుక్షణం ఉత్కంఠరేపే స్క్రీన్ ప్లే సినిమాకు ప్రధాన ఆకర్షణ.ప్రముఖ దర్శకుడు గోవింద్ నిహాలాని కథ అందిచగా,కమల్ స్క్రీన్ ప్లే రాసారు. మనదేశం తరపున ఆస్కార్ కి పంపబడ్డ సినిమా. టెర్రరిజం నేపధ్యంతో తెలుగులో వచ్చిన అతికొద్ది మంచి చిత్రాల్లో,ఆలోచింపజేసే చిత్రాల్లో ఇది ఒకటి.

అయితే ద్రోహి ప్రివ్యూ చూడడానికి కె.విశ్వనాథ్, కమల్ హాసన్ తో పాటుగా శుభలేఖ సుధాకర్ తన భార్య శైలజ తో ఈ సినిమా ప్రివ్యూ చూడడానికి రావడం జరిగింది. ద్రోహి చూస్తున్న సమయంలో ముందుగానే శుభలేఖ సుధాకర్ ఈ సినిమాలో అసభ్యకర సన్నివేశం ఉంటుందని చెప్పినప్పటికీ ఎస్.పి శైలజ సినిమాలో నిమగ్నమైపోయారు. అయితే ద్రోహి సినిమాలో సుధాకర్, గౌతమి తో మిస్ బిహేవ్ సీన్ ఒకటి ఉంటుంది. సినిమాలో అలాంటి సీన్ చూసి తట్టుకోలేకపోయిన ఎస్.పి.శైలజ సుధాకర్ ని కాల్చి పారేయండంటూ.. కేక వేయడంతో చుట్టూ ఉన్న ప్రముఖులు షాక్ అయ్యారట. తర్వాత తేరుకున్న శైలజ ఇది సినిమా కదా అని భావించి తిరిగి ఇంటికి వెళ్ళిపోయారట .

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news