Gossipsఆ విషయంలో మహేష్ బాబుకు మండిపోయింది..ఆ నిర్మాతకు స్ట్రాంగ్ వార్నింగ్..?

ఆ విషయంలో మహేష్ బాబుకు మండిపోయింది..ఆ నిర్మాతకు స్ట్రాంగ్ వార్నింగ్..?

సాధారణంగా స్టార్ హీరో సినిమా గురించి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అందుకే జనాలలో సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసేందుకు టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్‍ పోస్టర్స్, సాంగ్స్.. టీజర్.. ట్రైలర్.. ఇలా ఒక్కొక్కటి రివీల్ చేస్తూ.. సినిమాపై ఆసక్తిని పెంచుతుంటారు. అయితే అలా కాకుండా.. సినిమాకు సంబంధించిన విషయాలు, పోస్టర్స్, వీడియోస్ ముందే లీకైతే.. ఆ చిత్రాలకు ఎంతో నష్టం చేకూరుతుంది. అందుకే లీక్‏ల విషయంలో యూనిట్ సభ్యులు ఎంతో జాగ్రత్తలు తీసుకుంటుంటారు. అయినా కానీ.. కొన్ని సందర్బాల్లో పలువురు స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన విషయాలు లీక్ అవుతుంటాయి. తాజాగా మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న “సర్కారు వారి పాట” విషయంలోనూ లీక్‏ల బెడద తప్పడం లేదు.

సూపర్ స్టార్ మహేష్ బాబు.. సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత వంశీ పైడిపల్లితో నెక్ట్స్ మూవీ చేయాలనుకున్నాడు. కానీ ఎందుకో ఆ ప్రాజెక్ట్‌ను హోల్డ్‌లో పెట్టి పరశురామ్‌తో నెక్ట్స్ ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ‘సర్కారు వారి పాట’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో ఈ సినిమా ఉండనుందని తెలుస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రీలుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది.

తాజాగా ‘సర్కార్ వారి పాట’ సినిమాకి సంబంధించి ఒక వీడియో నెట్లో లీక్ కావడం హీరో లుక్, డైలాగ్స్ కూడా ఆ వీడియోలో ఉండటం హీరో మహేష్ కి కోపం తీసుకొచ్చిందట. సోషల్ మీడియాలో లీక్ కావడంపై మహేష్ బాబు తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ వీడియో నెట్లో లీక్ విషయమై మహేష్ బాబు తన సన్నిహితుల వద్ద కాస్త కోపం పడినట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకాక.. నిర్మాతకు మరో సారి ఇలా జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వార్నింగ్ కూడా ఇచ్చారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news