రెబల్‌స్టార్ ప్రభాస్ కాజల్ అగర్వాల్ జోడీకి హిట్ అండ్ లవ్లీ పెయిర్ అని గుర్తింపు ఉంది. వారిద్దరూ కలిసి రెండు సినిమాల్లోనే నటించినా, అభిమానుల మనసుల్లో మాత్రం అలా ఉండిపోయారు. డార్లింగ్(2010), మిస్టర్ ఫర్ఫెక్ట్(2011) మాత్రమే జంటగా చేసిన వీరిద్దరూ.. దాదాపు పదేళ్ల తర్వాత మరోసారి తెర పంచుకోనున్నారని వార్తలు వస్తున్నాయి.
పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలతో దూసుకుపోతుంది హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఇప్పటికే చిరంజీవితో ఆచార్య, కమల్‌హాసన్‌తో ఇండియన్-2 చిత్రాలు చేస్తున్న కాజల్ ఇప్పుడు మరో పాన్ ఇండియా ప్రాజెక్టులో కనిపించనుందట. కథల ఎంపిక విషయంలో చాలా పకడ్బందీగా ఆలోచిస్తున్న కాజల్…ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్టుకు ఓకే చెప్పిందట. ప్రభాస్‌తో ఓ స్పెషల్ సాంగ్‌లో చిందేయడానికి ఈ చందమామ ఒప్పుకున్నట్లు సమాచారం.
గతంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ సినిమాలో స్పెషల్ సాంగ్ లో ఆకట్టుకుంది కాజల్. పక్కలోకల్ అంటూ ప్రేక్షకులను పిచ్చేక్కించింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేయబోతోందని తెలుస్తుంది.
ప్రశాంత్‌నీల్ కాంబినేషనల్ లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ మూవిలో కాజల్ స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్టు టాక్. ఈ పాటలో కాజల్ అందాల ఆరబోత కూడా ఎక్కువగానే ఉంటుందట. గతంలో జనతా గ్యారేజ్‌లో ఓ స్పెషల్ సాంగ్ చేసింది కాజల్. తాను కేవలం జూనియర్ ఎన్టీఆర్ కోసం ఈ పాటలో నటించానని.. ఇక ముందెప్పుడు ఐటమ్ సాంగ్ లో నటించబోనని కాజల్ చెప్పింది. అయితే ప్రస్తుతం ప్రభాస్ కోసం కాజల్ మాట తప్పందని టాక్ వినిపిస్తోంది. దీంతో కాజల్ భర్త గౌతం కిచ్లు షాక్ అయ్యాడట .
యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ‘సలార్’లో ప్రభాస్ సరసన శ్రుతిహాసన్ హీరోయిన్గా చేస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుగుతోంది.