టాలీవుడ్లో నందమూరి ఫ్యామిలీ హిస్టరీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్టీఆర్ వేసిన విత్తనం ఇప్పుడు మూడో తరంలోనూ కంటిన్యూ అవుతోంది. ఈ ఫ్యామిలీ నుంచి ఎన్టీఆర్ – బాలయ్య – హరికృష్ణ – కళ్యాణ్ రామ్ – తారకరత్న హీరోలుగా వచ్చారు. అయితే ఇదే ఫ్యామిలీ నుంచి నందమూరి కళ్యాణ్ చక్రవర్తి కూడా వచ్చాడు. కళ్యాణ్ చక్రవర్తి ఎవరో కాదు ఎన్టీఆర్ సోదరుడు నందమూరి త్రివిక్రమరావు కుమారుడు. త్రివిక్రమ రావు నిత్యం ఎన్టీఆర్ వెంటే ఉండేవారు. ఎన్టీఆర్ సినిమాల్లో బిజీగా ఉన్నప్పుడు ఆయన బాగోగులు అన్ని చూసుకునేవారు. ఆ తర్వాత త్రివిక్రమ రావు నిర్మాతగా కూడా మారి అన్నయ్యతోనే కొన్ని సినిమాలు నిర్మించారు.
ఇక ఆయన కుమారుడు కళ్యాణ్ చక్రవర్తి సినిమాల్లోకి వచ్చి 1990వ దశకంలో ఇంటి దొంగ – రౌడీ బాబాయ్ – దొంగ కాపురం లాంటి సినిమాల్లో నటించాడు. దర్శకరత్న దాసరి నారాయణ రావు డైరెక్ట్ చేసిన చిరంజీవి లంకేశ్వరుడు సినిమాలో చిరంజీవికి బావగా… రేవతికి భర్తగా నటించాడు. టాప్ హీరోగా ఎదుగుతాడని అందరూ భావిస్తోన్న సమయంలో కళ్యాణ్ ఒక్కసారిగా వెండితెరకు దూరం అయ్యాడు. కళ్యాణ్ తండ్రి డైరెక్షన్లోనే ఎక్కువుగా కథలు ఎంపిక చేసుకునేవాడు.
ఎక్కువుగా ఫ్యామిలీ కథాంశం ఉన్న సినిమాల్లో నటించేందుకే ఇష్టపడే వాడు. అక్షింతలు, తలంబ్రాలు, ఇంటిదొంగ, దొంగ కాపురం, మేనమామ సినిమాలతో పాటు రౌబీ బాబాయ్, రుద్రరూపం సినిమాల్లో కూడా చేశారు. కళ్యాణ్ కెరీర్ స్వింగ్లో ఉన్న సమయంలో అతడి కుమారుడు పృథ్వి రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో మానసికంగా కుంగిపోయి సినిమాలకు దూరం అయ్యాడు. ఇక తండ్రి త్రివిక్రమ రావు చనిపోయాక సినీ పరిశ్రమ హైదరాబాద్కు వచ్చినా కళ్యాణ్ చెన్నైలోనే ఉంటూ వ్యాపారాలు చూసుకుంటూ అక్కడే సెటిల్ అయిపోయారు.