సీనియర్ కమెడియన్ సుధాకర్ గురించి తెలియని వారు ఉండరు. రెండున్నర దశాబ్దాల క్రితం సుధాకర్ ఓ పాపులర్ కామెడీ యాక్టర్. చిరంజీవి రూమ్ మేట్‌గా అందరికీ పరిచయం అయిన ఈయన.. ఆ తర్వాత తమిళనాడు వెళ్లి అక్కడ స్టార్ హీరోగా మారాడు. రజినీకాంత్ కంటే ముందే ఈయన తమిళంలో అగ్ర హీరోగా వెలుగొందాడు.
అయితే అక్కడ జరిగిన కొన్ని రాజకీయాల కారణంగా మద్రాసు వదిలేసి రావాల్సి వచ్చింది. సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు చిరంజీవి, సుధాకర్, హరిప్రసాద్ చెన్నైలో ఒకే రూమ్‌లో ఉండేవాళ్ళు. చిరంజీవి కంటే ముందు తమిళంలో 45 చిత్రాల్లో హీరోగా నటించాడు సుధాకర్. అక్కడ సూపర్ స్టార్ అవుతున్న తరుణంలో చిరంజీవికి ఇక్కడ అవకాశం వచ్చింది.
సుధాకర్‌కు కాలం కలిసి రాలేదు. అందుకే హీరోగా నిలదొక్కుకోలేదు. చివరకు కమెడియన్‌గా సెటిల్ అయ్యాడు. ఆ తర్వాత విపరీతమైన తాగుడు, స్కోకింగ్ అలవాట్లకు బానిస అయిపోయాడు. చివరకు ఈ దురలవాట్లతో జబ్బుపడ్డాడు. అసలు కోలుకుంటాడా ? అనుకున్న టైంలో కోలుకున్నా తర్వాత కెరీర్ కొనసాగించలేకపోయాడు. ఇక సుధాకర్ ప్రస్తుతం జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ 76 లో నివాసం ఉంటున్నాడు. సుధాకర్‌కు ఒక కొడుకు ఉన్నాడు. అతడి పేరు మైఖేల్ బెన్నీ.
కమెడియన్ సుధాకర్.. ఇప్పుడు తన కొడుకు బెనిడిక్ మైఖేల్ ను హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయనున్నాడు. ఓ ప్రాజెక్ట్ ఒకే అయిందని, దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతుందని సుధాకర్ అప్పుడు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. నరేష్ అనే ఓ కొత్త దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లుగా వెల్లడించారు. ఇక బెనిడిక్ మైఖేల్ మాట్లాడుతూ.. హీరోగానే కాకుండా.. తన తండ్రి లాగే మంచి పాత్రలు దొరికితే చేసేందుకు కూడా రెడీ అంటున్నాడు.