తండ్రి సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా టాలీవుడ్‌లో అడుగుపెట్టి తండ్రికి తగ్గ తనయుడుగా పేరు గడించారు. అంతేకాదు తండ్రిలా సూపర్ స్టార్ హోదాను సంపాదించుకున్నారు. బాల నటుడిగా ప్రవేశించి ఆ తర్వాత హీరోగా తన కంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు మహేష్ బాబు. మహేష్ బాబు చిత్ర పరిశ్రమకి రాజకుమారుడు సినిమాతో హీరోగా పరిచయమైయ్యాడు. రాజకుమారుడు 1999 లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇది మహేష్ బాబుకు కథానాయకుడిగా మొదటి సినిమా. ప్రీతి జింటా అతనికి జోడీగా నటించింది.
వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీ దత్ నిర్మించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్నందించాడు. ఈ సినిమాకు అక్కినేని ఉత్తమ కుటుంబ కథా చిత్రంగా నంది అవార్డు లభించింది. ఇది హిందీలోకి ప్రిన్స్ నంబర్ 1 పేరుతో అనువాదం అయింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా మహేష్‌కు మంచి పేరును తెచ్చిపెట్టింది. మహేష్ బాబు రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి 22 ఏళ్లు పూర్తయింది. రెండు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో బాక్సాఫీస్ వద్ద ఎన్నో హిట్స్ అందుకున్న సూపర్ స్టార్ హీరోయిజంకు కూడా 22 ఏళ్లు అన్నమాట.
1979 లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా అరంగేట్రం చేసిన తరువాత, మహేష్ తొమ్మిది సినిమాల్లో నటించాడు, ఆ తరువాత, అతను 24 సంవత్సరాల వయస్సులో రాజ కుమారుడు సినిమాలో హీరోగా ఎంట్రీ ఇవ్వగా..వరుస సినిమాలను చేసుకుంటూ స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిపోయాడు. ఇక ఇప్పుడు ఆయన సినిమా వస్తోందంటే అభిమానులతో పాటు జనాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. ఇక సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. కాగా.. తొలిరోజే 48లక్షల షేర్ వసూలు చేసిన ఈ మూవీ 37సెంటర్స్ లో 100డేస్ ఆడింది ఈ సినిమా. ఇక మొదటి సినిమాతోనే 8కోట్ల వసూళ్లు రాబట్టిన రాజకుమారుడు మూవీలో మహేష్ నటన అన్ని కోణాల్లో అదరగొట్టాడు.