సోషల్ మీడియా స్టార్స్‌కు ఉండే ఫాలోయింగ్ వేరబ్బా.. ఒకప్పుడు డబ్ స్మాష్ ఆ తరువాత టిక్ టాక్ అంటూ ఎంతో మంది వెలుగులోకి వచ్చారు. ఇక యూట్యూబ్‌లో అయితే వెబ్ సిరిస్‌లు, షార్ట్ ఫిల్మ్స్‌ల ద్వారా ఎంతో మంది స్టార్లుగా మారారు. అందులోంచి కొంత మంది బిగ్ బాస్ షోలోకి వచ్చారు. అలా దీప్తి సునయన బిగ్ బాస్ షోతో బాగానే ఫేమస్ అయ్యారు. ఇక దీప్తి సునయన బిగ్ బాస్ షోలో పదే పదే షణ్ముఖ్ పేరు చెప్పడం, తలుచుకోవడంతో అతను కూడా ఫేమస్ అయ్యారు. దీప్తి సునయన, షణ్ముఖ్ మధ్య వ్యవహారం ఎప్పుడూ కూడా హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది.
షణ్ముఖ్ జస్వంత్.. ఈ పేరు చాలా మందికే పరిచయం. ముఖ్యంగా యూట్యూబ్‌ను రెగ్యులర్ చూస్తుంటే షణ్ముఖ్ ఎవరు తెలుస్తుంది. ఇతనో సోషల్ మీడియా స్టార్. షణ్ముక్ జస్వంత్ యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్, డాన్స్ వీడియోలతో చాలా ఫేమస్ అయ్యాడు. ఈ మధ్య కొన్ని వెబ్ సిరీస్‌లు కూడా తీస్తున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో వచ్చిన సాప్ట్ వేర్ డెవలపర్ అనే వెబ్ సిరీస్ మంచి ఆదరణ పొందింది.
ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రేండింగ్ నెంబర్ 1 ఉంది అంటే అది సూర్య వెబ్ సిరీస్. ప్రతి మిడిల్ క్లాస్ అబ్బాయికి రిలేటెడ్ గా ఉంటూ ప్రతి ఎపిసోడ్ ట్రేండింగ్ నెంబర్ 1లో ఉంటూ రికార్డులు బద్దలు కొడుతుంది సూర్య వెబ్ సిరీస్. ఇక ఈ వెబ్ సిరీస్ లో సూర్యగా షణ్ముఖ్ జస్వంత్ నటిస్తే.. హీరోయిన్ గా మౌనిక రెడ్డి నటిస్తుంది. మిడిల్ క్లాస్ బాయ్ ఫ్రెండ్ కోసం సంపాదించిన జీతం మొత్తం అతని చేతులో పెట్టి సూపర్ గర్ల్ ఫ్రెండ్ గా నిలిచింది.
మౌనిక రెడ్డికు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తెనాలి దగ్గర కొలిపరలో 1994 ఏప్రిల్ 10న మౌనిక జన్మించింది. తండ్రి సుబ్బారెడ్డి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారు. అమ్మ రాణి గృహిణి. తన స్కూలింగ్ అంతా తెనాలి కృష్ణవేణి టాలెంట్‌లో పూర్తి చేసింది. తరువాత వైజాగ్ చైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్, తిరుపతి విద్యానికేతన్ కాలేజీ నుంచి బీటెక్, వైజాగ్ విజ్ఞాన్ కాలేజీలో ఎంబీఏ పూర్తి చేసింది.
హైదరాబాద్ హెచ్‌జిఎస్ కంపెనీలో హెచ్ ఆర్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసింది. అయితే ఉద్యోగం చేస్తున్నప్పుడే వెబ్ సిరీస్‌లో అవకాశాలు రావడంతో ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండా 17 ఎపిసోడ్స్‌లో నటించింది.ఆపై రెండేళ్లకు జాబ్‌కు రిజైన్ చేసి.. వెబ్ సిరీస్ సూర్య.. షణ్ముఖ్ జస్వంత్‌తో కలిసి నటిస్తోంది. ఇందులో తన నటనకు గాను మంచి మార్కులే పడుతున్నాయి. వెబ్ సిరీస్ ద్వారా నెలకు రూ.50 వేలు సంపాదిస్తోందట మౌనిక.