శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీ డేస్ సినిమాతో హ్యాపీడేస్ సినిమాతో చాలా మంది హీరోలుగా హీరోయిన్స్ గా మారిన విషయం తెల్సిందే.ఈ సినిమా హీరోగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్ సందేశ్ ఆతర్వాత పలు సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు. అయితే వరుణ్ కు చెప్పుకోదగ్గ హిట్ మాత్రం పడలేదు. దాంతో ఈ మధ్య కాస్త గ్యాప్ తీసుకున్నాడు వరుణ్. ఆ మధ్య బిగ్ బిస్ షోలోకి ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకున్నాడు.
తొలి సినిమాతోనే తిరుగులేని సూపర్ హిట్ కొట్టిన వరుణ్ సందేశ్ ఆ తర్వాత దిల్ రాజు నిర్మాతగా వచ్చిన కొత్త బంగారులోకం సినిమా తో మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఆ తర్వాత వరుణ్ సందేశ్ చేసిన సినిమాలేవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. దీంతో సినిమాలకు కొంతకాలం బ్రేక్ ఇచ్చిన వరుణ్ సందేశ్ బిగ్బాస్ షోతో ద్వారా మరోసారి తెలుగు ఆడియోన్స్కు దగ్గరయ్యాడు. సీజన్-3లో మిస్టర్ కూల్ అనే ట్యాగ్ లైన్ను సంపాదించుకున్నాడు. ఓ దశలో బిగ్ బాస్ విన్నర్ వరుణ్ సందేశే అనుకున్నారంతా. అయితే ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాలతో టాప్4 స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
అయితే , కెరీర్ ఆరంభంలో కొన్ని హిట్లు కొట్టిన వరుణ్ సందేశ్ ఆ తర్వాత సరైన కథలు ఎంచుకోక పోవడంతో వరుస ప్లాపులు ఎదుర్కొన్నాడు. ఒకటి కాదు రెండు కాదు వరుణ్ ఏకంగా 13 ప్లాపులు వరుసగా ఇచ్చి టాలీవుడ్ యువ హీరోల్లో ఎవ్వరికి లేని చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
అయితే వరుణ్ సందేశ్తో ఛమ్మక్ ఛల్లో అనే సినిమా ఘోరంగా డిజాస్టర్ అవ్వడంతో పాటు పెట్టిన పెట్టుబడి కూడా రాకపోవడంతో సినిమా నిర్మాత డీఎస్. రావు.. తనకున్న సొంత థియేటర్ను కూడా అమ్ము కోవాల్సి వచ్చిందంట.ఇక గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఓ థియేటర్ కొని రీ మోడటింగ్ చేసి సాయికృష్ణ డీలక్స్ గా పేరు పెట్టారు. అయితే ఓ ఫైనాన్షియర్ మోసం చేయడంతో పాటు ఎక్కువ వడ్డీలు వేయడంతో చివరకు డీఎస్ రావు ఈ థియేటర్ను వదులు కోవాల్సి వచ్చినట్లు సమాచారం. ఇక వరుణ్ సందేశ్ దెబ్బకి ఆయన సర్వం అమ్ముకున్నడని టాలీవుడ్ టాక్.