Moviesచిరంజీవి అందుకున్న మొదటి పారితోషకం ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

చిరంజీవి అందుకున్న మొదటి పారితోషకం ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

కష్టపడితే మనిషి మహోన్నత స్థానానికి ఎదుతాడనే దానికి నిలువెత్తు నిదర్శనం మెగాస్టార్ చిరంజీవి. 1979లో ప్రాణం ఖరీదు చిత్రంతో కెరీర్ ను స్టార్ట్ చేసిన చిరు తన సినీ కెరీర్ లో అనేక ఎత్తు పల్లాలను, సవాళ్లను ఎదుర్కొని ఈరోజు మెగాస్టార్ గా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు. తన మెగా హిట్స్ తో తెలుగు సినిమా స్టామినా పెంచిన మెగాస్టార్ బాక్సాఫీస్ కింగ్ గా వెలిగారు.

మెగా ఫ్యామిలీకి మూలమైన చిరంజీవి.. సినిమా ఇండస్ట్రీలోకి ఎలాంటి సపోర్ట్ లేకుండానే వచ్చారు. ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా చలన చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి.. స్వయం కృషితో ఎదిగిన ఒకెఒక్క స్టార్ హీరో మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరో మన చిరంజీవి. పశ్చిమ గోదావరి జిల్లాలోని మారుమూల గ్రామంలో పుట్టి.. చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్నారు ఘనత మెగాస్టార్ చిరంజీవి కే సాధమైంది.

హీరోగా అడుగు పెట్టినా .. తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ కష్టఫడి ఒకొక్క మెట్టు ఎక్కుతూ.. దాదాపు 20ఏళ్ళు టాలీవుడ్ నెంబర్ వన్ హీరోగా తెలుగు చిత్ర సీమను ఏలారు మెగాస్టార్ చిరంజీవి. డ్యాన్సులు, ఫైట్స్ అంటూ ప్రేక్షకులకు కొత్త హీరోయిజాన్ని పరిచయం చేశారు చిరు. యంగ్ జనరేషన్ నటీనటులకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పటికీ తాను నటించే ప్రతి సినిమాను మొదటి సినిమా భావిస్తారని టాక్.

అయితే..చిరంజీవి ఇప్పుడు కోట్లకు కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. కానీ, ఆయన మొదటి సినిమాకి ఎంత పారితోషకం తీసుకున్నారో తెలుసా..?? తెలిస్తే ఆశ్చర్య పోతారు. అసలు నమ్మలేరు. చిరంజీవి నటించిన మొదటి సినిమా పునాదిరాళ్లు అయినప్పటికీ మొదట ప్రాణం ఖరీదు అనే సినిమా విడుదలైంది.

కానీ,ఈ రెండు సినిమాలకు చిరంజీవి పారితోషికం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు.. మన ఊరి పాండవులు సినిమా కి 1116 రూపాయలు పారితోషికం తీసుకున్నారు. ప్రస్తుతం ఆచార్య అనే సినిమాను విడుదలకు సిద్ధంగా ఉంచాడు మెగాస్టార్ చిరంజీవి. ఆ తర్వాత లూసిఫర్ రీమేక్, వేదాలమ్ రీమేక్ లో నటించనున్నాడు. ఇక బాబీ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి. ఈ చిత్రంలో ద్విపాత్రాభినయంలో నటిస్తున్నాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news