సిక్స్ ప్యాక్ యాబ్…..నేటి యువతకు క్రేజ్. కాని అందుకోసం ఎంతో శ్రమపడాలి. ముందుగా బానపొట్టను కరిగించేయాలి. పొట్టకు మాత్రమే వ్యాయామమంటే చాలదు. వ్యాయామానికి తగ్గ ఆరోగ్యవంతమైన ఆహారాన్ని కూడా తీసుకోవాలి. పొట్టలో ఆరు కండలను పొందటానికి వ్యాయామాలతోపాటు అవసరమైన ఆహారం కూడా తీసుకోవాలి. వాటి తో పాటు చిన్న చిన్న కసరత్తులు కూడా చేయాలి. హీరోలు అంటే దృఢమైన శరీరాకృతితో కనిపించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం హీరోలు సైతం ఈ సిక్స్ ప్యాక్ బాట పడుతున్నారు.ఎందుకంటే..??
సినిమాల కోసం మన హీరోలు రకరకాలుగా సరికొత్తగా మేక్ ఓవర్ చేసుకుని ప్రేక్షకులను అలరించడానికి ఎంతగానో కృషి చేస్తుంటారు. టాలీవుడ్ లో ఎప్పటినుంచో మన హీరోలు సిక్స్ ప్యాక్ లతో తమ సినిమాలకు ఎక్స్ ట్రా మైలేజీని తీసుకొస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఎప్పటి నుంచో వస్తున్న దీన్ని మన హీరోలు కూడా సాంప్రదాయంగా పాటిస్తూ..దొరికిందే ఛాన్స్ అని తమ రేంజ్ ను పెంచుకునేస్తున్నారు.
ఇక సిక్స్ ప్యాక్ హీరోల లిస్ట్ లో.. ప్రభాస్ , ఎన్టీఆర్, నాగార్జున, బన్నీ, రవితేజ, రామ్ పోతినేని, విజయ్ దేవరకొండ, నితిన్ వంటి హీరోలు సిక్స్ ప్యాక్ తో ఇప్పటికే ప్రేక్షకులను ఎంతగానో అలరించగా ఇటీవలే అక్కినేని అఖిల్ సిక్స్ ప్యాక్ లో కనిపించి వాహ్ అనిపించుకున్నారు. హీరోలు చాలామంది సిక్స్ ప్యాక్ తో సిల్వర్ స్క్రీన్ పై మాయ చేశారు.
ఇంకా బెల్లంకొండ శ్రీనివాస్ , సునీల్, సుదీర్ బాబు, నవదీప్ , కార్తికేయ, నిఖిల్, మంచు విష్ణు, అల్లు శిరీష్, సాయిధరమ్ తేజ్, ప్రిన్స్, విజయ్ దేవరకొండ వంటి హీరోలు సిక్స్ ప్యాక్ తో ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. ఏజెంట్ సినిమా కోసం అక్కినేని అఖిల్ ఇటీవలే సిక్స్ ప్యాక్ బాడీని రివీల్ చేశారు. ఈ లుక్ ఒక్కసారిగా సినిమాపై భారీ అంచనాలను పెంచింది.