దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు సినీ ప్రస్థానం గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు తారసపడతాయి. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు అంటే కమర్షియల్ చిత్రాలకు పెట్టింది పేరు. కమర్షియల్ చిత్రాల ట్రెండ్ సృష్టించారాయన. వెండితెరపై గ్లామర్‌ని పరిచయం చేశారు. వీటిలో ముఖ్యంగా రాఘవేంద్రుడికే సొంతమైన ప్రత్యేకమైన శైలి ఒకటుంది. అదే ఎంతో రొమాంటిక్‌గా హీరోయిన్ బొడ్డుపై పండు విసరడం. హీరోయిన్లను శృంగార దేవతలుగా చూపించడంలో కె.రాఘవేంద్రరావు తరువాతనే ఎవరైనా అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.
ముఖ్యంగాహీరోయిన్లని ఎన్ని రకాలుగా చూపించొచ్చో, ఎంత అందంగా చూపించగలమో చేసి చూపించారాయన. ఇక రాఘవేంద్రరావు అంటే ఠక్కున గుర్తొచ్చేది హీరోయిన్ల నడుముపై పండ్లు వేయడం. సినిమాలో ఆయా సీన్లు అంతే ఫేమస్సు. ఆయన హీరోయిన్ల నాభిపై పూలు, పండ్లు వేస్తూ పాటలను అత్యంత శృంగార భరితంగా రూపొందిస్తారు. రాఘవేంద్రరావు సినిమాల్లోని పాటల కోసమే ప్రేక్షకులు థియేటర్లకు పలుమార్లు వెళ్లేవారు అంటే అతిశయోక్తి కాదు.
ఆయన 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఈ ప్రత్యేకత మాత్రం ఆ నాటి నుంచి నేటి వరకు అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఆయన రూపొందిస్తున్న ప్రతి సినిమాలో ఈ సీన్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తుంటుంది ప్రేక్షకలోకం. మరి ఈ రాఘవేంద్రుడు మొదట ఏ హీరోయిన్‌తో ఈ ప్రత్యేక ప్రయాణం మొదలు పెట్టారో చూద్దామా..
అయితే ఇలా వేయడానికి ముందు బీజం పడింది మంచి దొంగ సినిమాలో. 1988లో రాఘవేంద్రరావు దర్శకత్వం లో ‘మంచి దొంగ’ సినిమా విడుదలయ్యింది. ఈ మూవీలో చిరంజీవి, సుహాసిని, విజయశాంతి హీరో హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ సినిమాలోని “బెడ్ లైట్ తగ్గించినా” అనే పాట చిరంజీవి, విజయశాంతిల ఫస్ట్ నైట్ నేపథ్యంలో కొనసాగుతుంది.
ఈ పాట షూట్ చేయడం కూడా చాలా గమ్మత్తుగా ఉండేలా ప్లాన్ చేశారు. పాటలో లైట్ ఆన్ చేసినప్పుడు ఒక బీట్… ఆన్ చేసినప్పుడు మరో బీట్ వచ్చేలా చక్రవర్తి సెట్ చేసిన ట్యూన్‌కు రాఘవేంద్రుడి చిత్రీకరణ కూడా దుమ్మురేపేలా సెట్ అయ్యింది. ఇక అప్పటి నుంచి ఆయన ప్రతి సినిమాలోనూ ఇలా హీరోయిన్లపై పండ్లు వేయడం కామన్ అయ్యింది. కాగా, రాఘవేంద్రరావు ఈ పాటలో విజయశాంతి పై పండ్లను వినియోగించారు. ఈ సినిమాకి ముందు రాఘవేంద్రరావు పలు సినిమాల్లో పూలు, పండ్లను వినియోగించారు కానీ హీరోయిన్ పై పూలు, పండ్ల తో అభిషేకం చేయలేదు.