Moviesమన హీరోయిన్స్ వాటిని ఎందుకు పెంచుకుంటారో తెలుసా..?

మన హీరోయిన్స్ వాటిని ఎందుకు పెంచుకుంటారో తెలుసా..?

మనిషికి కుక్క అత్యుత్తమ నేస్తం అనేది కొత్తగా చెప్పాల్సిన పని లేదు. మానవ చరిత్రను పరిశీలిస్తే మనిషికి తోడుగా ఉండి, పనిచేసిన జంతునేస్తం కుక్కే. పెంపుడు జంతువులను పెంచుకోవడం అందరూ చేసే పనే. వాటిమీద విపరీతమైన ప్రేమ కురిపిస్తారు కొంతమంది. కొందరైతే పెంపుడు జంతువులే తమ ప్రాణంగా భావిస్తారు. అలాంటి వాటిలో కుక్కపిల్లలు ముందుంటున్నాయి. కుక్కపిల్లలు ఇంట్లో ఉంటే, ఇంట్లో మరో వ్యక్తి ఉన్నంత భావన కలుగుతుంది.

జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక్క హాబి ఉండే ఉంటుంది. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా,హీరోయిన్ అయినా కొన్ని ఇష్టాయిష్టాలు,హాబీస్ ఉంటాయి. ప్రస్తుతం స్టార్ హీరోయిన్స్ గా రాణిస్తున్న భామలకు కూడా కొన్ని హాబీస్ ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీలో అని కాకుండా చాలామంది తమ తమ అభిరుచులకు అభిప్రాయాలకు తగ్గట్లుగా తమ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు.

వ్యాపారాలు టెన్షన్ లు డబ్బు ఇవన్నీ కాకుండా తమ సొంత అభిరుచులకు తగ్గట్లుగా వారు జీవనం కొనసాగిస్తూ ఉంటారు. ఆ విధంగా కొంతమంది పెంపుడు జంతువులను పెంచుకోవడం మనం చూస్తుంటాం. ఎప్పుడు సినిమాలతో బిజీగా ఉండే పలువురు తెలుగు సినిమా స్టార్లు కూడా తమ పెంపుడు కుక్కలకు వీరాభిమానులే. కొందరైతే అవి లేకుండా ఉండలేరు. వాటితో బలమైన బంధం ఏర్పరుచుకున్నారు. అలాంటి సినీతారల ఎవరో మనం ఇప్పుడు ఇక్కడ చూద్దామా..

దాదాపు అందరు హీరోయిన్ లకు కుక్కలను పెంచే అలవాటు ఉంది ఈ సంగతి మనకు తెలిసిందే. ఈ మధ్యనే సమంత తన పెంపుడు కుక్క తో వాలీబాల్ ఆడుతూ వీడియోను షేర్ చేయగా… ఇక రష్మిక ఏకంగా తన పెంపుడు కుక్కకు బోలెడన్ని ముద్దులు పెడుతూ కనిపించింది. అదేవిధంగా కీర్తి సురేష్ డ్రెస్సులు వేసి ఎంతో అందంగా పెళ్లి కూతురు గా తన పెంపుడు కుక్కలను తయారు చేయగా…. అనుష్క, పూజా హెగ్డే, రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్య, ఛార్మి లు కూడా ఖాళీ సమయాలలో తమకు తోడుగా పెంపుడు కుక్కలను పెంచుకుంటూ సంతోషంగా ఉంటున్నారు. వాటితో ఉన్న క్షణాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ సందడి చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news