ఘట్టమనేని నమ్రత.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు అంటు ఉండరు అనడంలో సందేహం లేదు. మన టాలీవుడ్ ప్రిన్స్ హీరో మహేష్ బాబు భార్యగా సూపర్‌స్టార్‌కు సంబంధించిన అన్ని విషయాలను చూసుకుంటూ ఉంటుంది. టాలీవుడ్లో క్యూట్ కపుల్స్‌లో మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ జోడీ కూడా ఒకటి. ఎవరైన సరే ఈ జంటను చూస్తే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అనాల్సిందే.. అలా ఉంటుంది ఈ జంట.
ఇక నమ్రతను పెళ్లి చేసుకున్న తర్వాత మహేష్ బాబు కెరీర్ టర్న్ అయ్యింది. వరుసగా హిట్లు కొడుతూ మహేష్ కెరీర్ స్పీడ్ అందుకుంది. అంతేకాదు.. మహేశ్ బాబు సినిమాకు సంబంధించిన పబ్లిసిటీ సహా పలు వ్యవహారాలను నమ్రత దగ్గరుండి చూసుకుంటారనే టాక్ కూడా సిని ఇండస్ట్రీలొ వినపడుతుంది. ఇక మహేష్ బాబు, నమ్రత వీళ్లిద్దరిది లవ్ మ్యారెజ్ అనే విష్యం మనకు తెలిసిందే. అసలు మహేష్ – నమ్రత మధ్య ప్రేమ ఎలా ? పుట్టింది ఎక్కడ ? చిగురించింది అన్నది ఆసక్తికర విషయమే.
ఈ జంట బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వంశీ’ సినిమాలో మాత్రమే కలిసి నటించారు. ఆ సినిమాలో వీళ్లిద్దరు కలిసి నటించడం వీరి జీవితాన్నే మార్చివేసిందనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ కూడా కీలక పాత్రలో నటించడం విశేషం. ఈ సినిమా షూటింగ్ లో భాగంగా కొన్ని పాటలు , సన్నివేశాల చిత్రీకరణ కోసం దర్శకుడు బి.గోపాల్ ఆస్ట్రేలియాలో 40 రోజుల పాటు సుదీర్ఘమైన షెడ్యూల్ చేశారు.
ఆ సమయంలో వారిద్దరూ బాగా సన్నిహితులు అయ్యారు. ఎంతలా అంటే.. ఇండియాకు తిరిగి వచ్చాక మహేష్ చాలాసార్లు సీక్రెట్ గా ముంబై వెళ్లి.. నమ్రత బేబీని కలిసి వచ్చేవాడిట. ఈ విషయమై అప్పట్లో ప్రముఖ సినీ మ్యాగజైన్లో బాగా గాసిప్పులు వచ్చాయి.
ఇలా సాగిన వీరి ప్రేమాయణం..2005 లో భార్యభర్తలుగా మారారు. 2005 వరకు ఐదు సంవత్సరాల పాటు ప్రేమించుకున్న ఈ జంట 2005లో ముంబైలో ఫిబ్రవరి 10న కొద్ది మంది బంధు మిత్రుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు వీళ్లకి ఒక పాప.. ఒక బాబు కూడా ఉన్నారు.