ఒరిజినల్లో ఒక నటుడు అద్భుతంగా చేశాడని పేరు తెచ్చుకున్నాక.. రీమేక్ మూవీలో ఎంత బాగా చేసినా అంత పేరు రాదు. ఒరిజినల్లోని హీరో లాగే చేస్తే కాపీ అంటారు. మార్చి చేస్తే అంత బాగా చేయలేదంటారు. కానీ వెంకీ చేసిన రీమేక్ సినిమాలోని పెర్ఫామెన్స్ చూస్తే మాత్రం ఒరిజినల్లో హిరోస్ కంటే బాగా చేసారని.. పెర్ఫామెన్స్ చూసి ఫిదా అయిపోయిన వాళ్లు కూడా వెంకీకి సలాం కొడతారు.
అంత బాగా ఏ పాత్రను అయినా పండించగలడు వెంకీ. ఆయన లుక్.. బాడీ కూడా ఆ పాత్రకు సరిగ్గా సూటయ్యాయే కధలే ఎంచుకోవడం మన వెంకి స్పెషాలిటీ. అయితే వెంకీ మామ ఇప్పటికే ఎన్నో సినిమాలను రీమేక్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల రిలీజ్ అయిన నారప్ప మూవీ లో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు వెంకటేష్. అయితే వెంకటేష్ కెరీర్ లో వచ్చిన రీమేక్ సినిమాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మలయాళం మూవీ ఆర్యన్ మూవీకి రీమేక్ గా ధ్రువ నక్షత్రం మూవీని 1989లో రిలీజ్ చేసారు. వై నాగేశ్వరరావు డైరెక్ట్ చేసారు. తీర్ధ కనలై తమిళ మూవీకి రీమేక్ గా 1988లో వచ్చిన వారసుడొచ్చాడు మూవీని ఏ మోహన్ గాంధీ తెరకెక్కించారు. హిందీలో అనిల్ కపూర్ హీరోగా వచ్చిన తేజాబ్ మూవీకి రీమేక్ గా వెంకీ హీరోగా టూటౌన్ రౌడీగా తీశారు. సూర్య వంశం అనే సినిమా తమిళంలో సూపర్ హిట్ అయ్యింది. ఇక ఇదే సినిమాను అదే టైటిల్ తో తెలుగులోకి రీమేక్ చేశారు. తెలుగులో కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
రజనీకాంత్ తమిళంలో నటించిన అన్నామలై కి రీమేక్ గా తెలుగులో వెంకీతో కొండపల్లి రాజా మూవీ తీశారు. రవిరాజా పినిశెట్టి డైరెక్ట్ చేసిన ఈ మూవీ 1993లో రిలీజయింది. ఎంగ చిన్నరాజా తమిళ మూవీకి రీమేక్ గా అబ్బాయిగారు మూవీ తీశారు. ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్ అనే ఆంగ్ల మూవీ ఆధారంగా కె రాఘవేంద్రరావు డైరెక్షన్ లో ముద్దుల ప్రియుడు తీశారు. గోవిందా హీరోగా హిందీలో వచ్చిన అంకెన్ మూవీకి రీమేక్ గా పోకిరి రాజా మూవీ తీశారు.
తమిళంలో విక్రమ్ హీరోగా నటించిన మూవీ జెమిని. అయితే ఈ సినిమా తమిళం ఇండస్ట్రీలో యావరేజ్ గా ఆడిన, తెలుగులో మాత్రం ఫ్లాప్ అయింది. తమిళంలో సూర్య హీరోగా నటించిన కాకా కాకా సినిమాకు రీమేక్ గా వచ్చింది. హీరో సూర్య నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక సూర్య నటనను కూడా మరిపించే విధంగా ఘర్షణ సినిమాలో నటించి మెప్పించాడు విక్టరీ వెంకటేష్.