Moviesవీళ్లిద్దరిలో మొదట 'I LOVE YOU" అని చెప్పింది ఎవరో తెలుసా..??

వీళ్లిద్దరిలో మొదట ‘I LOVE YOU” అని చెప్పింది ఎవరో తెలుసా..??

సమంత-నాగ చైతన్య జంట గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఏ మాయ చేసావే సినిమాలో మొదటిసారి కలిసి నటించారు నాగచైతన్య, సమంత.. ఈ సినిమాతో బెస్ట్ జోడి అనిపించుకుంది ఈ జంట.. ఈ సినిమా తర్వాత ప్రేమలో పడిన వీరు ఆటోనగర్ సూర్య, మనం, మజిలీ చిత్రాలలో కలిసి నటించారు. ఇక కెరీర్ టాప్ లో ఉన్న సమయంలో ఇరువురు కుటుంబ సభ్యులను ఒప్పించి అక్టోబర్ 06 2017లో ఒక్కటయ్యారు.. ఇక పెళ్లి తర్వాత కూడా సమంత హీరోయిన్ గా రాణిస్తోంది.

ఏమాయ చేశావే సినిమా షూటింగ్ ఫస్ట్ డే రోజు మాత్రం నాగచైతన్యను చూసి అస్సలు పట్టించుకోలేదట మన సాం బేబీ. అలా నాగ చైతన్యను చూసి హాయ్ అని చెప్పి వెంటనే మరలా తల తిప్పుకొని తన స్క్రిప్ట్ చదువుకుందట. కానీ.. తర్వాత మెల్లగా మెల్లగా నాగ చైతన్య మీద అభిమానం పెరిగిందట. అయితే.. మన అక్కినేని నాగ చైతన్య కంటే ముందు సమంతనే ప్రేమలో పడిందట. ఆ తర్వాత నాగ చైతన్య ప్రేమించడం మొదలు పెట్టాడట. ఆ తరువత నాగ చైతన్యనే ఫస్ట్ సమంతకి ఐ లవ్ యు అని చెప్పాడట.

టాలీవుడ్ బెస్ట్ కపూల్ లిస్టులో అక్కినేని నాగచైతన్య, సమంత ఒకరు. సుదీర్ఘ ప్రేమాయ‌ణం త‌ర్వాత పెళ్లి పీట‌లెక్కిన ఈ జంట.. ఎలాంటి వివాదాలు లేకుండా జీవితాన్ని సాఫీగా కొనసాగిస్తున్నారు. ఇటు వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్‌ చేస్తూనే వృత్తిపరంగా రాణిస్తున్నారు. పెళ్లి తర్వాత ఇద్దరూ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు.

సమంత-నాగ చైతన్య జంట గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒకరు సోషల్ మీడియాలోనే గడిపేస్తుంటే ఇంకొకరు సోషల్ మీడియాలో ఆమడ దూరంలో ఉంటారు. ఒకరు ఎప్పుడూ లైమ్ లైట్‌లోనే ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు.. మరొకరు ఈ ప్రపంచానికి దూరంగా తన ప్రపంచం ఏదో తానే అన్నట్టుగా ఉంటారు. సమంత సోషల్ మీడియాలో ఎక్కువగా గడుపుతంటారు. కానీ నాగ చైతన్య మాత్రం ఎప్పుడో అలా ఒక పోస్ట్ చేస్తుంటారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news