Moviesఓ..షట్.. ప్రభాస్ ని ఇలా బుక్ చేసారు ఏంటి..ఇప్పుడు డార్లింగ్ ఏం...

ఓ..షట్.. ప్రభాస్ ని ఇలా బుక్ చేసారు ఏంటి..ఇప్పుడు డార్లింగ్ ఏం చేస్తారు అబ్బా..??

తెలుగు ఇండ‌స్ట్రీలో ఎవ‌ర్ గ్రీన్ హాట్ టాపిక్ ఒక్కటే ఒక్కటి. అదే మన డార్లింగ్ ప్ర‌భాస్ పెళ్లి. డార్లింగ్‌’ ఈ పేరు వినగానే సినీ అభిమానులకు గుర్తొచ్చే పేరు ప్రభాస్‌. తనతో … కాదు, యావత్‌ తెలుగు సినీ ప్రేక్షకులతో ‘​డార్లింగ్‌’ అనిపించుకున్నారు ప్రభాస్‌. ఈయ‌న పెళ్లి ఎప్పుడెప్పుడు జ‌రుగుతుందా అని సెలబ్రిటీలు, అభిమానులు కూడా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. దానికి తోడు ప్ర‌భాస్ పెళ్లి టాపిక్ డైలీ సీరియ‌ల్స్ కంటే దారుణంగా సాగుతుంది. టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ పెళ్లికి సంబంధించి ఇప్పటికే అనేక వార్తలు షోషల్ మీడియాలో, సినీ ఇండస్ట్రీలో వైరల్ అయిన సంగతి మనకు తెలిసిందే. ఒక స్టార్ హీరోయిన్ తో ప్రభాస్ ప్రేమలో ఉన్నారని ఒక్కరంటే.. మరోక్కరు ఏమో భీమవరంకు చెందిన అమ్మాయిని ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నారని జోరుగా ప్రచారం జరిగాయి.

ఆశ్చర్యం ఏమిటంటే అందులో ఒక్కటి అంటే ఒక్కటి నిజం లేదు..కాలేదు. ప్రస్తుతం ప్రభాస్ వయస్సు 41 సంవత్సరాలు కాగా త‌మ అభిమాన న‌టుడు ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటాడా..? ఎవ‌రిని పెళ్లి చేసుకుంటాడా..? అన్న ఫ్యాన్స్ ఎదురుచూపులు ఆగ‌డం లేదు. ఇంకోవైపు ప్ర‌భాస్ ఎప్పుడు పెళ్లి అని అడిగితే అప్పుడు చేసేందుకు తామంతా రెడీగా ఉన్నామ‌ని కుటుంబ స‌భ్యులు చెబుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ప్ర‌భాస్ పెళ్లి మ‌రోసారి తెరపైకి వ‌చ్చింది.

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ లిస్ట్ లో టాప్ లో కొనసాగుతున్నారు డార్లింగ్ ప్ర‌భాస్.,తన పెళ్లితో పాటు మరో హీరో పెళ్లికి కూడా అడ్డుపడుతున్నారట. అదేంటి ప్రభాస్ మరో హీరో కి అడ్డుపడుతున్నాడా అనుకుంటున్నారా..?? డైరెక్ట్ గా కాదండోయ్ పరోక్షంగా అడ్డుపడుతున్నారట. తమ అభిమాన కథానాయకుడు ఫ్యామిలీ హీరో శర్వానంద్ పెళ్లి ఎప్పుడు అంటూ అభిమానులు ఎప్పటినుంచో అడుగుతున్న విషయం మనకు తెలిసిందే. కాగా శర్వా పెళ్లి ఎప్పుడు జరగాలన్న అంశం స్టార్ హీరో ప్రభాస్ పెళ్లిపై ఆధారపడి ఉందట.ఈ విషయం స్వయంగా శర్వానే చెప్పాడట. “ప్రభాస్ అన్న పెళ్లి చేసుకున్నాకే నా పెళ్లి అని ఖచ్చితంగా చెప్పేశాడట” శర్వా. శర్వానంద్ ఫ్రెండ్ అయిన స్వప్నిక ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటపెట్టేసింది. దీంతో ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news