Gossipsప్ర‌భాస్‌ను టెన్ష‌న్ పెడుతున్నారా... తీవ్ర ఒత్తిడిలో రెబ‌ల్‌స్టార్ ?

ప్ర‌భాస్‌ను టెన్ష‌న్ పెడుతున్నారా… తీవ్ర ఒత్తిడిలో రెబ‌ల్‌స్టార్ ?

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ బాహుబ‌లి, సాహో సినిమాల‌తో టాలీవుడ్ నుంచి ఇప్పుడు ఏకంగా నేష‌న‌ల్ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు ప్ర‌భాస్ సినిమా చేస్తుంటే కేవ‌లం టాలీవుడ్‌లో మాత్ర‌మే చేస్తానంటే ఎవ్వ‌రూ ఒప్పుకునే ప‌రిస్థితి లేదు. ప్ర‌భాస్ ప్ర‌స్తుతం లైన్లో పెట్టిన అన్ని సినిమాలు పాన్ ఇండియా రేంజ్‌లో భారీ స్థాయిలో తెర‌కెక్కేవే. స‌లార్‌, ఆదిపురుష్‌, రాధే శ్యామ్‌, నాగ్ అశ్విన్ సినిమా ఇవ‌న్నీ కోట్ల బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్‌లోనే తెర‌కెక్కుతున్నాయి.

అయితే ప్ర‌భాస్ ఇప్పుడు సినిమా ఇండ‌స్ట్రీలోనే మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచిల‌ర్ అయిపోయాడు. అత‌డి తోటి హీరోలు పెళ్లి చేసుకుని ఇద్ద‌రు పిల్ల‌ల‌ను కూడా క‌న్నారు. మ‌నోడు 42 సంవ‌త్స‌రాలు వ‌చ్చినా ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఇక ఇప్పుడు మ‌రో నాలుగు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. ఇవి పూర్త‌య్యే స‌రికి మ‌రో నాలుగేళ్లు ప‌ట్టేలా ఉంది. ఈ క్ర‌మంలోనే త్వ‌ర‌గా పెళ్లి చేసుకోమ‌ని ప్ర‌భాస్‌ను ఇంట్లో వాళ్ల‌తో పాటు పెద‌నాన్న కృష్ణంరాజు తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నార‌ట‌.

రాధేశ్యామ్ 2021లో వ‌స్తే, ఆదిపురుష్ 2022లో, స‌లార్ 2023లో, నాగ్ అశ్విన్ సినిమా 2024లో వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి. అంటే మ‌రో నాలుగేళ్ల‌కు కూడా ప్ర‌భాస్ డైరీ ఖాళీ లేదు. ఇక ఇప్పుడు మరో పాన్ ఇండియా సినిమాను కూడా మ‌నోడు లైన్లో పెడుతున్నాడ‌ట‌. దీంతో ఇంట్లో వాళ్లు సైతం ప్రభాస్ మీద అస‌హ‌నం వ్య‌క్తం చేయ‌డంతో పాటు .. ముందుగా పెళ్లి చేసుకోమ‌ని తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నార‌ట‌. మ‌రోవైపు పాన్ ఇండియా ఇమేజ్ ఒత్తిడితో ప్ర‌భాస్ పెళ్లిని వాయిదా వేయ‌డం కూడా ఎవ్వ‌రికి న‌చ్చ‌డం లేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news