Gossipsఅక్కినేని ఇంట పెళ్లి భాజా..సడెన్ షాకిచ్చిన నాగార్జున..?

అక్కినేని ఇంట పెళ్లి భాజా..సడెన్ షాకిచ్చిన నాగార్జున..?

అక్కినేని.. ఈ పేరుకి టాలీవుడ్ లో ఈ ప్రత్యేకమైన స్దానం ఉంది. అక్కినేని నాగేశ్వరవు ఎంతో కష్టపడి.. తన నటనతో మనల్ని మెప్పించారు. అలాగే ఆయన నాట వార్సత్వం పుచ్చుకున్న నాగార్జున కూడా.. తండ్రి పేరు కి ఈ మాత్రం ఆటంకం కలగనీయకుండా..ఆ అక్కినేని బ్రాండ్ ను అల్లగే కొనస్సగించారు. ఇప్పుడు మూడోతరంగా అక్కినేని నాగచైతన్య-అక్కినేని అఖిల్ ఆ పేరు పైకి తిసుకొస్తున్నారు. అయితే.. ఈ అక్కినేని వారింటా మరోసారి పెళ్లి భాజాలు మోగుతున్నాయి.

అక్కినేని నాగేశ్వరరావు మనవడుగా.. నాగార్జున మేనల్లుడుగా ఇండస్ట్రీలోకి వచ్చిన సుమంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రేమకథ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సుమంత్ ఆ తర్వాత సత్యం అనే సినిమా ద్వారా అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. అయితే ఆ తర్వాత అవకాశాలు వచ్చినప్పటికీ అతనికి మాత్రం పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. ఆ త‌ర్వాత హీరోయిన్ కీర్తిరెడ్డిని .. అక్కినేని మేన‌ళ్లుడు సుమంత్‌ను పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్ల‌యిన యేడాదిలోపే వీరిద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డంతో విడిపోయారు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ దంప‌తులు ఇంత త్వ‌ర‌గా ఎందుకు విడిపోయారు ? అన్న‌ది ఇండ‌స్ట్రీలో చాలా మందికి అంతుప‌ట్ట‌లేదు.

వీరి మ‌ధ్య గ్యాప్ రావ‌డానికి కార‌ణం.. సుమంత్‌ను కీర్తి అమెరికాలో సెటిల్ అవుదాం.. అక్క‌డ‌కు వ‌చ్చేయ‌మ‌ని కోర‌గా… సుమంత్ మాత్రం తాను త‌మ కుటుంబానికి ఉన్న ఇమేజ్‌, సినిమాల‌ను వ‌దిలి అమెరికాలో సెటిల్ అయ్యేందుకు ఎంత మాత్రం ఒప్పుకోలేద‌ట‌. కీర్తిరెడ్డి ఫ్యామిలీ ఆర్థికంగా ఉన్న‌వాళ్లు. దీంతో ఆమె అమెరికాలో బిజినెస్ చేసి అక్క‌డే సెటిల్ అవుదామ‌నుకున్నా సుమంత్ ఒప్పుకోలేదు. ఈ విష‌యంలో వీరి మ‌ధ్య గ్యాప్ రావ‌డంతో విడిపోయారు. ఆ త‌ర్వాత కీర్తి ఓ ఎన్నారైను పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయ్యింది. కీర్తి దంప‌తుల‌కు ఇప్పుడు ఇద్ద‌రు పిల్ల‌లు.

ఇక ఆ తరువాత సుమంత్ మాత్రం ఒంటరిగానే గడుపుతున్నారు. తనని మరో పెళ్లి చేసుకొమ్మని ఇంట్లో వళ్లు ఫోర్స్ చేస్తే.. సరైన వ్యక్తి దొరికితే చేసుకుంటాలే అని చెప్పేవాడట. అయితే ఇప్పుడు ఆ సరైన వ్యక్తి దోరికేసిన్నట్లు ఉన్నరు. సుమంత్ ఎట్టకేలకు రెండవ సారి పెళ్లి చేసుకోబోతున్నారని, తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు పవిత్ర అని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే సుమంత్ రెండో పెళ్లి వెనుక మేజర్ హ్యాండ్ ఎవరిదో తెలుసా..?? ఇంకెవరు మన మనధుడు నాగార్జునాదేనట..పెళ్ళి పనులు ఎలాంటి హడావుడి లేకుండా సైలెంటుగా జరిపించేస్తున్నారట కిం నాగార్జున., చాలా తక్కువ మంది సన్నిహితులు కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే వీరి వివాహం జరుగుతుందనే వార్తలు కూడా జోరుగా వినిపిస్తున్నాయి. ఈ విషయంపై అక్కినేని కుటుంబం త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news