Moviesఅబ్బో..వీళ్లు మహాముదురులేండి.. గప్ చుప్ గా మ్యాటర్ ఫినిష్ చేసిన మహానటిమణులు..!!

అబ్బో..వీళ్లు మహాముదురులేండి.. గప్ చుప్ గా మ్యాటర్ ఫినిష్ చేసిన మహానటిమణులు..!!

సినీ ఇండస్ట్రి అంటేనే ఎఫైర్స్, గాసిప్స్ సర్వసాధారణం. అలాంటి గాసిప్స్ ను చాలా మంది నటిమణులు వాళ్ల పెళ్లిల విషయంలో నిజం చేసారు. పెళ్లి అంటే స్వర్గంలో నిర్ణయం చేయబడుతుంది అంటారు. కానీ అవి అందరికి సాధ్యం కావు. కొందరు అనుకోని పరిస్థుతులలో ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుండి పారిపోయి రహస్యంగా వివాహం చేసుకోవాల్సి వస్తుంది.ఇటీవల కాలంలో ఎంతోమంది స్టార్ హీరోయిన్స్ రహస్యంగా పెళ్లి చేసుకుని, అభిమానులకు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ పద్ధతి ఇప్పటిది కాదు. నాటి నుంచి వస్తున్న పద్దతే. సావిత్రి ఎలాంటి పెద్ద పెద్ద హీరోయిన్లు కూడా నాటి కాలంలో పెద్దలకు తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. అయితే ఎవరెవరు ఆ కాలంలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు.. అనే విషయాలను ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.

సావిత్రి: మహానటిగా పేరు తెచ్చుకున్న సావిత్రి అప్పటికే పెళ్లయిన జెమినీని ప్రేమ్మించి పెళ్లి చేసుకున్న తర్వాత నాలుగేళ్ళ వరకు ఆ విషయం ఎవరికీ చెప్పకుండా కాపురం చేసింది. తర్వాత జరిగిన కథ అంత అందరికి తెలిసిందే.

జయప్రద: జయప్రద బాలీవుడ్ ప్రొడ్యూసర్ అయిన శ్రీకాంత్ నహతా ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ విషయం కూడా ఎవరికీ తెలియదు. కాకపోతే శ్రీకాంత్ నహతా కూడా ముందే పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉండడం గమనార్హం.

శ్రీదేవి: శ్రీదేవి మొదట మిథున్ చక్రవర్తిని ప్రేమించి రహస్యంగా తాళి కట్టించుకుని మూడేళ్ళ తర్వాత బోనీ ఎంట్రీతో ఆ పెళ్లికి నీళ్లు వదిలేసి అతి కొద్దీ మంది సమక్షంలో బోనీని పెళ్లి చేసుకుంది.

అనన్య: ఇక నితిన్ అ ఆ సినిమాలో చెల్లి పాత్రలో నటించిన అనన్య సైతం ఇంట్లో వాళ్లకు చెప్పకుండా పారిపోయి ఆంజనేయులు అనే వ్యక్తి ని పెళ్లి చేసుకుంది.

సీత: సీత పార్థీబన్ అనే వ్యక్తిని.. ప్రేమించి పెళ్లి చేసుకొని.. కొన్ని కారణాల చేత విడాకులు తీసుకుంది. ఆ తర్వాత బుల్లితెర నటుడు సతీష్ అనే వ్యక్తిని కూడా ఎవరికీ చెప్పకుండా వివాహం చేసుకుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news