బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ ఖాన్ – కిరణ్ రావు దంపతులు 15 ఏళ్ల వైవాహిక జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు. అమీర్ ఖాన్ దాంపత్య జీవితానికి ఎంతో విలువ ఇస్తారన్న అభిప్రాయం అందరికి ఉండేది. అలాంటిది ఇద్దరు పిల్లలు పుట్టాక కూడా అమీర్ తన మొదటి భార్య రీనాకు విడాకులు ఇచ్చారు. వీరి విడాకులు అప్పట్లోనే చాలా మందికి నచ్చలేదు. ఆ తర్వాత అమీర్ కిరణ్ రావుతో ప్రేమలో పడి పెళ్లాడాడు. కిరణ్ రావు అమీర్ మధ్య లగాన్ సినిమా టైంలో ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారి వారు పెళ్లి చేసుకునే వరకు వెళ్లింది.
ఇక ఇప్పుడు ఈ దంపతులు పెద్ద సంచలన వార్త చెప్పారు. అమీర్ ఖాన్ – కిరణ్ రావు సంయుక్త ప్రకటనలో 15 సంవత్సరాల వివాహం తర్వాత విడాకులు తీసుకునట్లు ప్రకటించారు. మేము మా జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలనుకుంటున్నాము – ఇకపై భార్యాభర్తలుగా కాదు, సహ తల్లిదండ్రులుగా మరియు కుటుంబంగా ఉంటాము అని ప్రకటించారు. మీరు ఈ విడాకులను ముగింపుగా కాకుండా కొత్త ప్రయాణానికి ఆరంభంగా చూస్తారని అనుకుంటున్నట్టు కూడా వారు చెప్పారు.
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తన భార్య కిరణ్ రావ్ నుంచి విడాకులు తీసుకున్నట్లు ప్రకటించిన మరుక్షణమే.. అదొక హాట్ టాపిక్‌గా మారింది. సెటైర్లు, ట్రోలింగ్, నెగెటివ్ కామెంట్లతోనే నిన్నంతా సోషల్ మీడియాలో చర్చ నడించింది. కిరణ్ రావ్ ఆమిర్ ఖాన్ వ్యవహారం మీద సోషల్ మీడియాలో భిన్న రకాల అభిప్రాయాలు వెలువడుతున్నాయి.
ఒకప్పుడు కిరణ్ రావ్ చేసిన వ్యాఖ్యలు, ఆమిర్ ఖాన్ అఫైర్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. నాటి విషయాలను తవ్వుతూ నెటిజన్లు ఇద్దరి మీద సెటైర్లు వేస్తున్నారు. అయితే హాఠాత్తుగా ఫాతిమా సనా షేక్ పేరు తెర మీదకు వచ్చింది. రీల్ లైఫ్ డాటర్.. రియల్ లైఫ్ వైఫ్‌గా మారబోతోందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. రికార్డుస్థాయిలో ఆమె పేరు హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్లు ట్విటర్లో పోస్ట్ అయ్యాయి.
29 ఏళ్ల ఫాతిమా.. 56 ఏళ్ల అమీర్‌తో వరుసగా రెండు సినిమాలు చేసింది. ఆ సమయంలో ఇద్దరి మధ్య ఏదో నడుస్తోందని బాలీవుడ్ మీడియా హౌజ్‌లలో పుకార్లు వినిపించాయి.ఆమిర్‌ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ‘దంగల్’లో ఆయన పెద్ద కుమార్తెగా నటించి అందర్నీ ఆకర్షించింది నటి ఫాతిమా సనా షేక్.
‘దంగల్’ తర్వాత ఆమిర్.. తాను నటించిన ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’లో ఫాతిమాకి హీరోయిన్గా ఛాన్స్ ఇవ్వడంతో ఈ వార్తలకు మరింత ఆజ్యం పోసినట్లు అయ్యింది. అంతేకాకుండా ఆ సినిమా విడుదలయ్యాక కూడా ఫాతిమా చాలా సందర్భాల్లో ఆమిర్ ఇంటి వద్ద కనిపించడంతో బీటౌన్‌లో వీళ్లిద్దరే హాట్ టాపిక్ అయ్యారు. మొత్తానికి ఆమిర్ ఖాన్ కిరణ్ రావ్ విడాకుల వ్యవహారం కొత్త కొత్త టాపిక్‌లకు తెరదీస్తోంది. అయితే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టుగా ఫాతిమా ఆమిర్ ఖాన్ వ్యవహారం ఎక్కడి వరకు దారి తీస్తుందో చూడాలి.