కోట్లాది మంది క్రికెట్ అభిమానులు భారత జట్టు ఖచ్చితంగా ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిఫ్ ఫైనల్లో గెలిచి విశ్వవిజేతగా నిలుస్తుందని అనుకున్నారు. అయితే అందరి అంచనాలు తల్లకిందులు చేస్తూ ఫైనల్లో భారత్ ఓడిపోయింది. వాస్తవానికి మ్యాచ్ ప్రారంభానికి ముందు అన్ని విభాగాల్లోనూ కీవీస్‌పై ఎంతో పటిష్టంగా ఉన్న భారత్‌కు తిరుగు ఉండదనే అనుకున్నారు. అయితే అంచనాలు అన్ని రివర్స్ అయ్యాయి. భారత్ మ్యాచ్ ఓడిపోవడానికి నలుగురే ప్రధాన కారణమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్రీజులో నిలదొక్కుకోవడంలో భారత టాప్ ఆర్డర్ విఫలం అయ్యిందన్నది వాస్తవం.
ఈ ఘోర ఓటమిలో కెప్టెన్ కోహ్లీది ప్రధాన పాత్ర అంటున్నారు. జట్టు కూర్పు లో ఫెయిల్ అయ్యాడంటున్నారు. ఫేస్ పిచ్‌పై ఇద్దరు స్పిన్నర్లను ఎందుకు తీసుకున్నాడో తెలియని పరిస్థితి. ఇక భారత్ ఫేస్ కింగ్ బుమ్రా ఘోరంగా విఫలమయ్యాడు. అసలు బుమ్రా కన్నా షమీ, ఇషాంత్ చాలా బెటర్ అనిపించారు. బుమ్రా కీవీస్ బ్యాట్స్‌మెన్లను ఏ మాత్రం ఇబ్బంది పెట్టలేదు. ఇక ఛటేశ్వర్ పూజారా నుంచి భారత అభిమానులు, టీం ఎంతో గొప్పగా ఆశిస్తే మనోడు తుస్సు మనిపించాడు.
పూజారా రెండు ఇన్సింగ్స్ లలో మొదటి ఇన్నింగ్స్‌లో 8 పరుగులు.. రెండవ ఇన్నింగ్స్‌లో 15 పరుగులు మాత్రమే చేసి ఘోరంగా విఫలమయ్యాడు. టెస్ట్ బ్యాట్స్‌మెన్ అయిన పూజారా ఇంత దారుణంగా చేతులు ఎత్తేస్తాడని ఎవ్వరూ ఊహించలేదు. ఇక యంగ్ క్రికెటర్ శుభమన్ గిల్ ఘోర వైఫల్యం కూడా భారత స్కోరుపై ప్రభావం చూపించింది. ఈ నలుగురే ఫైనల్లో భారత్ ఓడిపోవడానికి ప్రధాన కారణం అంటూ సోషల్ మీడియాలో వీళ్లను ఓ ఆటాడుకుంటున్నారు.