రాజ్‌తరుణ్ ఉయ్యాల జంపాల లాంటి చిన్న సినిమాతో ప్రేక్షకులకు పరిచయయ్యాడు. రాజ్‌తరుణ్ – అవికాఘోర్ జంటగా తెరకెక్కిన ఈ సినిమాను అక్కినేని నాగార్జున నిర్మించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అలాగే తొలి సినిమాతోనే రాజ్ బెస్ట్ మేల్ యాక్టర్‌గా సైమా అవార్డు సైతం అందుకున్నాడు. ఆ తర్వాత రెండో సినిమాగా సినిమాచూపిస్త మావ కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది. నక్కిన త్రినాథరావు ఈ సినిమాకు దర్శకుడు. ఆ తర్వాత సుకుమార్ బ్యానర్లో వచ్చిన మూడో సినిమా కుమారి 21 ఎఫ్ బ్లాక్ బస్టర్ కొట్టడంతో రాజ్ ఇమేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది.
మూడు వరుస హిట్లు తర్వాత అసలు రాజ్ తరుణ్ ఎవరు ? అన్న చర్చలు వచ్చాయి. పెద్ద హీరోలు సైతం రాజ్ గురించి ఆరా తీశారు. ఆ తర్వాత రాజ్ కెరీర్ పూర్తిగా రివర్స్ అయిపోయింది. వరుస ప్లాపులతో చివరకు రాజ్ సినిమా వస్తుందంటే సోషల్ మీడియాలో కూడా ఎలాంటి హంగామా ఉండడం లేదు. మధ్యలో అంధగాడు సినిమా యావరేజ్ అయినా వసూళ్లు రాలేదు. అయితే రాజ్ కెరీర్ రివర్స్ కావడానికి ప్రధాన కారణం ఓవర్ కాన్ఫిడెన్స్‌తో పాటు కథల ఎంపికలో లోపమే అన్న గుసగుసలు ఇండస్ట్రీ వర్గాల్లో ఉన్నాయి.
ముఖ్యంగా కథలను మార్చేయడం… దర్శకత్వంలో జోక్యం చేసుకోవడం కూడా రాజ్‌కు మైనస్ అయ్యాయి. ఇవి ఇండస్ట్రీలో బాగా స్ప్రెడ్ అవ్వడంతో అతడితో సినిమాలు చేసేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు ఓ యంగ్ క్రేజీ స్టార్ కావాల్సిన హీరో కాస్తా బిలో యావరేజ్ హీరోగా మిగిలిపోయాడు. పవర్ ప్లే దారుణంగా డిజాస్టర్ అయ్యి రాజ్ కెరీర్‌ను మరింత పతనం చేసింది.