టాలీవుడ్‌లో తిరుగు లేని హీరో మెగాస్టార్ చిరంజీవి… మూడు దశాబ్దాలుగా చిరంజీవి ఇండస్ట్రీని ఏలేస్తున్నారు. చిరు సినిమా రిలీజ్ అయితే బాక్సాఫీస్ దగ్గర వార్ ఎలా వన్‌సైడ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తోన్న చిరంజీవి ఈ సినిమా తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వలో వేదాళం రీమేక్‌లో నటిస్తున్నారు. కోలీవుడ్‌లో అజిత్ హీరోగా తెరకెక్కిన వేదాళం సూపర్ హిట్ అయ్యింది. చెల్లిలి సెంటిమెంట్ ఆధారంగా ఈ సినిమా రాగా.. శివ దర్శకత్వం వహించారు.
చిరు ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి దూసుకు పోతున్నాడు. ఈ సినిమాకు రు. 40 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్టు టాక్ ? సైరాకు రామ్ చరణ్ నిర్మాత కావడంతో రెమ్యునరేషన్ ఎంతన్నది బయటకు రాలేదు. వారిమధ్య ఏదో లావాదేవీలు నడిచాయి. ఇక ప్రస్తుతం కొరటాల శివతో చేస్తున్న ఆచార్య సినిమాకు రూ.50 కోట్లు తీసుకుంటున్నట్టు భోగట్టా ? ఈ సినిమాకు రామ్‌చరణ్‌తో పాటు నిరంజన్ రెడ్డి నిర్మాతలు. ఆచార్య తర్వాత వేదాళం స్టార్ట్ చేయనున్నారు.
ఈ సినిమాకు రు. 60 కోట్లు చిరుకు ముడుతున్నాయట. మరి ఏ ధీమాతో నిర్మాత అనిల్ సుంకర కూడా ఈ మెగా పేమెంట్‌కు ఒప్పుకున్నారో ? ఈ రీమేక్ సినిమాపై వారికి ఉన్న ధీమా ఏంటో ? చూడాలి. ఈ వయస్సులో చిరుకు ఇంత రెమ్యునరేషన్ అంటే చాలా గొప్ప అనే చెప్పాలి. మహేష్, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ లాంటి యంగ్ క్రేజీ హీరోల కంటే ఈ రెమ్యునరేషన్ ఎక్కువే. ఇది చిరు స్టామినాకు నిదర్శనం.