విక్టరీ వెంకటేష్ తొలి సినిమా కలియుగ పాండవులులో తమిళ ముద్దుగుమ్మ ఖుష్బూ హీరోయిన్గా నటించింది. ఆ తర్వాత కూడా ఆమె తెలుగులో చిరంజీవి, వెంకటేష్, నాగార్జున వంటి స్టార్ హీరోల పక్కన నటించింది. ఆ తర్వాత బాలీవుడ్‌లోకి కూడా వెళ్లింది. ఆమె తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకుంది. చాలా యేళ్ల తర్వాత మెగాస్టార్ స్టాలిన్ సినిమాలో చిరుకు చెల్లిగా కూడా నటించింది. ఆమెను అప్పట్లో తమిళ ప్రేక్షకులు విపరీతంగా ఆరాధించడంతో పాటు ఆమెకు ఏకంగా గుడి కూడా కట్టేశారు.
ఆ తర్వాత ఆమె దర్శకుడు సి. సుందర్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. ఆమె తెలుగులో ఓ ప్రముఖ దర్శకుడు తెరకెక్కించే సినిమాలో నటిస్తుండగా.. ఆ స్టార్ హీరో ఖుష్బూను కమిట్మెంట్ అడిగాడట. దీంతో ఫైర్ అయిన ఖుష్బూ సదరు హీరో కుమార్తెను తన తమ్ముడి గదిలోకి పంపిస్తే.. తాను ఆ హీరోకు కమిట్మెంట్ ఇస్తానంటూ చెంప చెళ్లుమనిపించే ఆన్సర్ ఇచ్చిందట. దీంతో ఆ హీరో బిత్తరపోయాడట. అప్పటి నుంచి సదరు సీనియర్ హీరోకు, ఖుష్బూకు మాటలు లేవట.
ఇప్పుడు ఖుష్బూ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పడంతో ఖుష్బూను కమిట్మెంట్ అడిగిన ఆ హీరో ఎవరు ? అని ఒక్కటే సెర్చ్ చేసేస్తున్నారు. ఆమె తెలుగులో చేసినవే తక్కువ సినిమాలు.. మరి వీరిలో ఎవరు ఆమెను కమిట్మెంట్ అడిగారో ? ఆమెకే తెలియాలి.