ఈ యేడాది భారత్‌లో జరగాల్సిన టీ 20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్ కరోనా కారణంగా కరోనా కారణంగా దుబాయ్‌కు షిఫ్ట్ అయ్యింది. దీనిపై ఐసీసీ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు ఈ టోర్నమెంట్ జరుగుతుంది. నవంబర్ 14న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మొత్తం నాలుగు వేదికల్లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం, ద షేక్ జయిదా స్టేడియం ( అబూదాబీ), ద షార్జా స్టేడియం, ఒమన్ క్రికెట్ అకాడమీ గ్రౌండ్స్‌లో మ్యాచ్‌లు జరుగుతాయి.
ఈ టోర్నమెంట్ రెండు అంచెలలో జరుగుతుంది. ముందుగా 8 దేశాలు రెండు గ్రూపులుగా విడిపోయి.. మెయిన్ రౌండ్ అర్హత పోటీల కోసం తలపడతాయి. ఒమన్, యూఏఈ దేశాల్లో ఈ రెండు గ్రూపుల మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ రెండు గ్రూపుల్లో బంగ్లాదేశ్, శ్రీలంక, స్కాట్లాండ్, నెదర్లాండ్స్, ఒమన్, పపువా న్యుగినియా, ఐర్లండ్, నమీబియా దేశాలు ఉన్నాయి. ఈ రెండు గ్రూపుల్లో ఒక్కో గ్రూప్ నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు మొత్తం 4 సూపర్ 12 రౌండ్‌కు అర్హత సాధిస్తాయి.
ఆ తర్వాత సూపర్ 12 రౌండ్ పోటీలు ప్రారంభమవుతాయి. ఇక్కడ నేరుగా అర్హత పొందిన 8 జట్లకు తోడుగా.. తొలి రౌండ్ ద్వారా అర్హత పొందిన నాలుగు జట్లు కలిసి మ్యాచ్‌లు ఆడతాయి. ఇక నవంబర్ 14న టోర్నీ మెగా ఫైనల్ ఉంటుంది.