కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గత యేడాదిన్నర కాలంగా ఎంత అతలా కుతలం చేస్తుందో చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ రెండో దశలో ఉందనే చెప్పాలి. కరోనా ఫస్ట్ వేవ్ సంగతేమో గాని.. సెకండ్ వేవ్‌లో మాత్రం ఎంతో మంది చనిపోయారు. సెకండ్ వేవ్‌లో ఆక్సిజన్ లెవల్స్ పడిపోయి చనిపోయిన వారిలో వృద్ధులు మాత్రమే కాదు… మధ్య వయస్సు ఉన్న వారు 35 – 45 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు కూడా చనిపోయారు. సెకండ్ వేవ్ కరోనా ఊపిరి తిత్తులపై తీవ్ర ప్రభావం చూపిందన్నది నిజం.
కరోనా సోకితే ఊపిరితిత్తులపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంగా కొందరిలో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి చివరకు ప్రాణాల మీదకు వస్తోంది. ఊపిరి తిత్తులు డ్యామేజ్ అయ్యాక చేసేదేం ఉండదు. అయితే చిన్న సింపుల్ చిట్కాతో ఊపిరితిత్తులు సరిగా పని చేస్తున్నాయా ? లేదా ? అన్నది తెలుసుకోవచ్చు. ఈ చిట్కాను కేంద్ర ఆరోగ్య శాఖే స్వయంగా చెప్పింది. కేవలం ఆరు నిమిషాల నడకతో ఇది తెలుసుకోవచ్చు.
ఇది ఎలా ఉంటే ముందుగా పల్స్ ఆక్సీమీటర్‌తో ఆక్సిజన్ లెవల్స్ ఎలా ఉన్నాయో ? చెక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆక్సీమీటర్‌తోనే ఆరు నిమిషాల పాటు ఆగకుండా కంటిన్యూగా నడవాలి. నడవడానికి ముందు.. ఆ తర్వాత ఆక్సిజల్ లెవల్స్ పాయింట్లలో తేడా ఉంటే ఆక్సిజన్ లెవెల్స్ దిగిపోతున్నాయి. ఆక్సిజన్ లెవల్స్ 94 కంటే దిగువకు వస్తే ఆక్సిజన్ లెవల్స్ తగ్గిపోతున్నాయని అర్థం. వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ పరీక్ష ఎవరైనా ఇంట్లో ఉండే చేసుకోవచ్చు.