దేశవ్యాప్తంగా కొద్ది రోజులుగా పెట్రోల్, డీజీల్ ధరల మంట మామూలుగా లేదు. రోజు రోజుకు పెట్రోల్ ధరలు మండి పోతున్నాయి. ఇప్పటికే సెంచరీ కొట్టేసిన పెట్రోల్ ధరలు ఈ రోజు మరో రికార్డు బ్రేక్ చేశాయి. లీటర్ పెట్రోల్ ధర 37 పైసలు పెరిగింది. ఇక డీజిల్ ధర 30 పైసలు పెరిగింది. చమురు సంస్థలు ధరలు పెంచడంతో పెట్రోల్ కంపెనీలు కూడా ధరలు పెంచక తప్పని పరిస్థితి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రు. 98.81 – డీజీల్ ధర రు. 89.13 కు చేరుకున్నాయి.
ఇక దేశంలో పెద్ద రాష్ట్రాల్లో ఇప్పటికే పెట్రోల్ ధరలు రు. 100 క్రాస్ చేసి రు. 105కు చేరుకున్నాయి. రాజస్థాన్‌లో శ్రీ గంగానగర్లో అయితే లీటర్ పెట్రోల్ రు. 110. 04 పైసలకు చేరుకుంది. డీజిల్ ధర అక్కడ రు. 102 ఉంది. ఆయా రాష్ట్రాల్లోని వ్యాట్ పన్నులో మార్పు ఆధారంగా రాష్ట్రాల్లో పెట్రోల్ ధరల మధ్య వ్యత్యాసం ఉంటుంది. ఏదేమైనా ఈ రేట్లు చూస్తే త్వరలోనే లీటర్ పెట్రోల్ రు. 150కు చేరుకున్నా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. ఇదే జరిగితే సామాన్యులు బైక్‌లు అమ్ముకోవడం లేదా బైక్‌లపై తిరగడం మానేయాల్సిందే..!