పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో తిరుగులేని విజయం అందుకున్నారు. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’మూవీలో రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 9న విడుదలై పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో అంజలి, అనన్య, నివేదా థామస్ కీలక పాత్రల్లో నటించారు. పింక్ సినిమా రీమేక్‌గా వచ్చిన వకీల్ సాబ్ సినిమా.. పవన్ కెర్రిర్ లోనే ది బెస్ట్ మూవీగా నిలిచింది.
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ మలయాళ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్.. అనే సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. అయితే వకీల్ సాబ్ తరువాత పవన్ కళ్యాణ్ ఫుల్ స్వింగ్‌లో షూటింగ్‌లను పూర్తి చేయాలని భావించారు. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్స్ కు బ్రేక్ పడ్డింది. ఇప్పుడిప్పుడే పరిస్ధితులు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. ఈ క్రమంలో షూటింగ్‌లు కూడా మొదలుపెట్టేశారు. ఈ క్రమంలో జూలై 11న సెట్స్ మీదకు పవన్ కళ్యాణ్ రాబోతోన్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
సూపర్‌స్టార్ రజనీకాంత్ అల్లుడిగానే తొలిసారి మనకి పరిచయమయ్యాడు ధనుష్! ఆ తర్వాత ‘వై దిస్ కొలవెరి!’ పాటతో ‘అబ్బో మామూలోడు కాదు’ అనిపించుకున్నాడు. ‘రఘువరన్ బీటెక్’తో మనలో ఒకడై పోయాడు. ఇది ఇలా ఉండగా.. డైరెక్టర్ శేఖర్ కమ్ముల తమిళ హీరో ధనుష్ హీరోగా ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాను ఏషియన్ గ్రూప్ భారీ లెవల్లో నిర్మిస్తోంది. ధనుష్ తెలుగులో నటిస్తున్న ఫస్ట్ స్ట్రయిట్ మూవీ కావడం విశేషం. అందుకే నిర్మాతలు ఈ చిత్రానికి గాను సుమారు ధనుష్ కు రూ.50 కోట్ల పారితోషకం ఇస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అసలు మ్యాటర్ ఏంటంటే.. ధనుష్ తన కెరీర్లో ఇప్పటి వరకు ఇంత పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ పుచ్చుకున్నది లేదట. కానీ ఏషియన్ గ్రూప్ నిర్మాతలు తెలుగులో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోకి ఇచ్చేంత రెమ్యునరేషన్ ఇస్తుండడం గమనార్హం.