మా ఎన్నికలు మాంచి రసవత్తరంగా మారాయి. అధ్యక్ష రేసులో ఉన్న మంచు విష్ణు, హేమ, జీవితా రాజశేఖర్ ప్యానళ్లపై అందరి దృష్టి పడింది.. ఈ ప్యానెల్స్ నుంచి ఎవరెవరు పోటీలో ఉంటారన్నదే ఇప్పుడు ఆసక్తికరం. జీవిత మాత్రం తాను ప్యానెల్ తయారు చేయనని.. తాను ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని చెప్పారు. ఇక తాజాగా మా వార్‌పై స్పందించిన ఆమె 900 మంది సభ్యులు ఉన్న మా ఎన్నికలు రచ్చకు దారి తీయడంపై ఆవేదన వ్యక్తం చేశారు.
గతేడాది తాము మాకు ఎన్నికైనప్పుడు అంతా కొత్తగా ఉండేదని… తాము ఎలాంటి ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్‌లో పాల్గోలేదన్నారు. అందరూ కలిసి ఏకాభిప్రాయంతో అనుకుంటేనే పనులు సాధ్యమవుతాయని ఆమె చెప్పారు. అసలు సమస్య అంతా ఇగో వల్లే అని చెప్పారు. తన భర్త రాజశేఖర్ పదవి విషయంలో సమస్య రావడంతో ఆయన పదవికి రాజీనామా చేశారని జీవిత తెలిపారు.
ఇక తాజా ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్, హేమ తాము అధ్యక్ష స్థానానికి పోటీ చేస్తున్నట్టు తనకు చెప్పలేదన్నారు. మోహన్‌బాబు మాత్రం మాట్లాడారాని .. మాలో 350 మంది మహిళలు ఉన్నారని.. అయితే ఇప్పటి వరకు ఒక్కరు కూడా మహిళా అధ్యక్షులు ఎంపిక కాలేదన్నారు. గతంలో పెద్దలు కూడా మా అధ్యక్షురాలిగా ఓ మహిళ ఉండాలని చెప్పినా అది జరగలేదన్నారు.