తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ( మా ) ఎన్నికల వేడి మామూలుగా లేదు. నిన్నటి వరకు చుతుర్ముఖ పోటీ అనుకున్న మా వార్ కాస్తా ఇప్పుడు సీవీఎల్ నరసింహారావు ఎంట్రీతో పంచముఖ పోరుగా మారింది. ఇక మాలో మొత్తం 900 మంది సభ్యులు ఉన్నారు. గెలుపు ఓటములు ఎలా ? ఉన్నా ఎవరికి ఎన్ని ఓట్లు పడతాయన్నదానిపై ఓ అంచనా అయితే బయట ట్రెండ్ అవుతోంది. ఇప్పటి వరకు బాలయ్య రంగంలోకి దిగకపోవడంతో చాలా మంది చిరు వైపు వెళ్లారని అంటున్నారు. ఇక బాలయ్య కూడా రంగంలోకి దిగారని.. ఆయన తన మద్దతు జీవితకు ఇస్తున్నట్టు త్వరలోనే ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
ఇక ఎవరు ఎవరి ఓట్లు చీల్చి ఎవరికి దెబ్బ కొడతారో ? కూడా అంచనాకు దొరకడం లేదు. బయట నడుస్తోన్న చర్చల ప్రకారం జీవిత, సీనియర్ నటి హేమ చీల్చే ఓట్లు కూడా ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ గా మారే అవకాశం ఉంది. హేమకు ఓట్లేసే బ్యాచ్ ఒకటి ఉందంటున్నారు. వాళ్లకు 150 ఓట్లు ఉన్నాయని తెలుస్తోంది. హేమ ఆ ఓట్లు ఎవరికి వేయాలని చెపితే ఆ ఓట్లు వాళ్లకే పడే అవకాశం ఉందని అంటున్నారు. అయితే హేమ వర్గం మాత్రం 900 ఓట్లలో 300 ఓట్లు తమకే పడతాయని వాళ్లు చెప్పుకుంటున్నారు.
ఇక చివర్లో ఆమె పోటీ నుంచి తప్పుకొని, వేరే వ్యక్తికి మద్దతిచ్చే అవకాశం ఉందంటున్నారు. అయితే ఆమె చిరంజీవి వైపు మొగ్గుచూపుతారా.. బాలయ్య వైపు వస్తారా అనేది సస్పెన్స్‌గానే ఉంది. ఇక మెగా కాంపౌండ్ ఓటింగ్ కూడా 150 – 200 వరకు ఉంటుందని చెపుతున్నారు. బాలయ్య రంగంలోకి దిగి జీవితకు సపోర్ట్ చేస్తే వాళ్లకు కూడా 200 ఓట్లు వరకు ఉంటాయంటున్నారు. ఓవరాల్‌గా చూస్తే మా ఓటింగ్ అంచనాల్లో మంచు విష్ణు బాగా వెనకపడిపోయాడు. మరి ఫైనల్ విన్నర్ ఎవరు అవుతారో ? చూడాలి.