Gossipsఎన్టీఆర్ ఎనర్జీకి ఆమైతే సూపరో సూపర్.. ఫ్యాన్స్ కు పూనకాలే..!!

ఎన్టీఆర్ ఎనర్జీకి ఆమైతే సూపరో సూపర్.. ఫ్యాన్స్ కు పూనకాలే..!!

వరలక్ష్మి శరత్ కుమార్.. ప్రముఖ తమిళ నటుడు శరత్ కుమార్ తనయగా చిత్రసీమకు పరిచయమై ఇప్పుడు ఆర్టిస్టుగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుంది. విలనీతో కూడిన కొన్ని రకాల పాత్రలకు.. ఫెరోషియస్ క్యారెక్టర్లకు ఆమె కొత్త చిరునామాగా మారింది. వరలక్ష్మి శరత్ కుమార్.. తమిళంలోనే కాదు తెలుగులో కూడా పలు సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా వుంది. ఇటీవలి కాలంలో ‘క్రాక్’, ‘నాంది’ సినిమాలలోని పాత్రలలో ఆమె ప్రదర్శించిన అభినయం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

రవితేజ క్రాక్ సినిమాలో జయమ్మ గా తన నటనతో స్టార్ హీరోలను సైతం ఫిదా చేసింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో వరలక్ష్మి ఓ రేంజ్‌లో అదరగొట్టింది. తన నటనతో సినిమాకు మరింత క్రేజ్‌ను తెచ్చింది. ఈ క్రమంలో వరలక్ష్మికి టాలీవుడ్ నుంచి పలు ఆఫర్లు వస్తున్నాయి.

స్టార్ హీరోలకు దీటుగా వుండే పాత్రలను కూడా ఆమెకు ఆఫర్ చేస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ హీరోగా కొరటాల శివ రూపొందించే చిత్రంలో ఆమెకు కీలక పాత్రను ఆఫర్ చేసినట్టు వార్తలొచ్చాయి. ఇదే సమయంలో ఎన్టీఆర్ సినిమా నుంచి కూడా ఆమెకు ఆఫర్ వెళ్లినట్టు తెలుస్తోంది. ‘అరవింద సమేత.. వీరరాఘవ’ వంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్లపై నందమూరి కల్యాణ్ రామ్, రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. క్రేజీ కాంబినేషన్ కావడంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. త్వరలోనే పట్టాలెక్కబోతున్న ఈ సినిమా గురించి తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.

తాజా సమాచారం ప్రకారం.. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ఓ పవర్ ఫుల్ పొలిటీషియన్ పాత్రను వరలక్ష్మి శరత్ కుమార్ కు ఆఫర్ చేసినట్టు సమాచారం. క్రేజీ ప్రాజెక్టు కావడంతో పాటు తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న కారణంగా జయమ్మ దీనికి వెంటనే ఓకే చెప్పేసిందని అంటున్నారు. ఆమె రాకతో ఈ సినిమాకు మరింత పవర్ యాడ్ అయినట్లు టాక్.

ఇక వరలక్ష్మి తమిళ సినిమాల విషయానికి వస్తే.. ‘విక్రమ్ వేదాతో పాటు ‘విష్మయ’ ‘మాణిక్యా’ ‘కసాబా’ వంటి చిత్రాల్లో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక విశాల్ బ్లాక్ బస్టర్ సినిమా పందెంకోడికి సీక్వెల్‌గా వచ్చిన ‘పందెం కోడి 2′, ఆ తర్వాత విజయ్ హీరోగా వచ్చిన ‘సర్కార్’ వంటి చిత్రాల్లో లేడీ విలన్ గా కనిపించి అదరగొట్టింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news