అలనాటి నటి రాశీ గుర్తుంది కదా.. మర్చిపోయే నటా ఆమె.. సీనియర్ నటి రాశీ అంటే తెలియని సినీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. తొంభైయవ దశకంలో కుర్రకారుకు నిద్రలేకుండా చేసిన అందరిలా రాశి. రాశీ.. అప్పట్లో ఈమెకున్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.. తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది రాశీ.
బాలనటిగా చలన చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి.. హీరోయిన్ గా ఫేమ్ సంపాదించుకున్న హీరోయిన్లలో శ్రీదేవి, మీనల తర్వాత రాశి అని చెప్పవచ్చు. ఈ సొట్టబుగ్గల సుందరి 1990వ దశకంలో అబ్బాయిల కలల సుందరి. చిరు నవ్వుతో అందరినీ ఆకట్టుకుంది. ఈ అచ్చ తెలుగమ్మాయి రాశి.. 90వ దశకంలో హీరోయిన్ గా అడుగు పెట్టి.. అతి తక్కువ సమయంలోనే 50సినిమాల్లో నటించింది.. ఎంత తర్వగా కెరీర్ లో ఎదిగిందో.. అంతే త్వరగా స్క్రీన్ నుంచి కనుమరుగైపోయింది చిన్నది.
అయితే అతి తక్కువ సమయంలో యాభై సినిమాలు చేసిన హీరోయిన్ గా ఆమె చరిత్ర సృష్టించగా స్టార్ హీరోలు కుర్రహీరోలు అనే తేడా లేకుండా నటించి మంచి ఇమేజ్ ని సంపాదించుకుంది. అక్కినేని నాగేశ్వర రావు గారి సినిమాలో రాశి బాలనటిగా ఎంట్రీ ఇచ్చింది. కళ్యాణ్ రామ్ తో పాటు రాశి కూడా బాలనటిగా బాలకృష్ణ నటించిన బాలచంద్రుడు నటించింది. అనేక సినిమాల్లో బాలనటిగా అలరించిన రాశి బదిలీ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే 1997లో హీరోయిన్ గా జగపతిబాబు శుభాకాంక్షలు తో సూపర్ హిట్ అందుకుంది. చిత్ర పరిశ్రమలో అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది రాశి..
ఇంతకు రాశి భర్త ఎవరో మీకు తెలుసా ? 2005లో ఒక సాధారణ అసిస్టెంట్ డైరెక్టర్ ను పెళ్లి చేసుకుంది రాశి. అతను ఎవరో కాదు శ్రీముని.అతని సినిమాలు పెద్దగా ఏవి లేకపోయినప్పటికీ ఆమె అతనికి ప్రపోజ్ చేసి ప్రేమించి పెళ్లిచేసుకుంది. వీరిద్దరికి ఒక అమ్మాయి కూడా ఉంది. రాశిని పెళ్లి చేసుకొనేందుకు ఎంతోమంది బడాబాబులు ముందుకు వచ్చిన ఆమె మాత్రం ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకొని అనందంగా జీవిస్తుంది. ఎంతైన ప్రేమకు ఉన్న పవర్ అలాంటిది మరి..
రిషి ని హీరోగా తీసుకొని “మహారాజశ్రీ”అనే సినిమాను, తన భర్త దర్శకుడిగా, తన భర్త ఫ్రెండ్ (రిషి)తో డిఎస్ రావు నిర్మాతగా ఈ సినిమాని తీశారు. ఈ సినిమా భారీ డిజాస్టర్ ను చవిచూసింది. ఇక అంతే కాకుండా తన భర్త దర్శకత్వంలోనే “ఆదిత్య అనే హీరోతో.. ప్లీజ్ స్వారీ థాంక్స్” సినిమా తీయడంతో ఇది కూడా ఫ్లాప్ అయ్యింది. ఇక త్రిల్లర్ హవా ఎక్కువ కొనసాగుతుండడంతో “లంక”అనే సినిమాను తిరిగి తన భర్త దర్శకత్వంలో తీయడంతో ఈ సినిమా కూడా ఫ్లాప్ ను చవి చూసింది. ఇక ఆమె తన భర్త కారణంగానే తను సంపాదించిందంతా పోగొట్టుకున్నారు అని సినీ వర్గాల టాక్
తెలుగు హీరోయిన్ రాశి అనగానే అందరికి ఆమె చిరునవ్వే గుర్తుకు వస్తుంది. గ్లామర్ హీరోయిన్స్ హడావుడి ఎక్కువవుతున్న తరుణంలో తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రాశి అప్పటి బ్యూటీలకు గట్టి పోటీని ఇచ్చింది. ఇక చాలా కాలం అనంతరం రాశి బుల్లితెరపై కూడా ప్రత్యేకమైన పాత్రలతో మెప్పిస్తోంది. ప్రస్తుతం జానకి కలగనలేదు సిరియల్ లో ఆమె చేస్తున్న పాత్ర శివగామి రేంజ్ లో క్లిక్కవుతోంది.
ఇక పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన రాశీ ప్రస్తుతం ఓ బుల్లితెర ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. మాటీవీలో ప్రసారమవుతున్న ‘జానకి కలగనలేదు’ అనే సీరియల్‌లో జ్ఞానాంబగా అలరిస్తుంది. హిందీ సీరియల్ దియా ఔర్ బాతి హమ్‌కు రీమేక్‌గా వచ్చిన ఈ సీరియల్‌తో తెలుగులో రీఎంట్రీ ఇచ్చిన రాశీకి మరోసారి అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు.