టాలీవుడ్లో ఆయనో స్టార్ డైరెక్టర్.. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేసుకుంటూ దూసుకు వెళుతున్నారు. ఆ స్టార్ డైరెక్టర్‌కు ప్లాప్ అన్నదే లేదు. ఈ క్రమంలోనే ఆ స్టార్ డైరెక్టర్ ఓ లేడీ ఓరియంటెడ్ సినిమా చేయాలని అనుకున్నాడు. ఈ క్రమంలోనే తెలుగు, తమిళ భాషల్లో మోస్ట్ సీనియర్ హీరోయిన్గా ఉండడంతో పాటు ఇటీవల అవకాశాలు తగ్గిన ఓ హీరోయిన్‌కు ఈ కథ వినిపించాడట. ఆమెకు ఇటీవల అవకాశాలు లేక ఫేడవుట్ హీరోయిన్ అయిపోయిందనే అందరూ అంటున్నారు.
తెలుగులో ఆమె నటించి చాలా కాలమే అయ్యింది. తమిళంలో అడపా దడపా సినిమాలు చేస్తున్నా ఆమెను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అలాంటిది ఆ ఫేడవుట్ హీరోయిన్‌కు ఈ స్టార్ డైరెక్టర్ ఇచ్చిన ఛాన్స్ ఓ విధంగా గోల్డెన్ ఆఫరే. అయితే ఆ ఫేడవుట్ హీరోయిన్ మాత్రం ఈ కథలు నాకు నప్పవు.. ఈ కథ ఏం బాగోలేదని ఓపెన్‌గానే చెప్పేసిందట. దీంతో ఆ స్టార్ డైరెక్టర్ అవాక్కడయ్యాడట. దీంతో సదరు స్టార్ డైరెక్టర్ ఆ ఫేడవుట్ హీరోయిన్ నా కథనే రిజెక్ట్ చేస్తుందా ? అని తీవ్ర అసహనంతో ఉండడంతో పాటు ఈ విషయాన్ని తన సన్నిహితులతో చెప్పి.. ఆమెకు చాలా గర్వం అని చెపుతున్నాడట.
ఈ విషయం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్‌గా మారింది. ఇక ఆ ఫేడవుట్ హీరోయిన్ తన కెరీర్‌ను కొనసాగించే ఉద్దేశంలో లేదా ? అందుకే ఈ బంగారం లాంటి ఛాన్స్ వదులుకుందా ? అని పలువురు చర్చించుకుంటున్నారు.